NTV Telugu Site icon

Jio Offer: కస్టమర్లకు న్యూఇయర్ గుడ్‌న్యూస్.. కొత్త రీచార్జ్ ప్లాన్ వచ్చేసింది!

Jio

Jio

న్యూఇయర్ సందర్భంగా జియో కస్టమర్లకు జియో గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సరం కానుకగా జియో కొత్త రీచార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. న్యూ ఇయర్‌ వెలకమ్‌ ఆఫర్‌ ప్లాన్‌ 2025ని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. రూ.2025 రీఛార్జ్‌పై లాంగ్‌టర్మ్‌ వ్యాలిడిటీతో పాటు రూ.2,150 విలువైన కూపన్‌ ప్రయోజనాలను అందించింది. ఈ రీచార్జ్ తో అన్ లిమిటెడ్ 5G ఇంటర్నెట్, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, వీటితో షాపింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. రీచార్జ్ ధరకంటే ఎక్కువ షాపింగ్ బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ రీచార్జ్ ప్లాన్ ద్వారా తన పార్టినర్స్ వెబ్ సైట్స్ ద్వారా అసాధారణ బెనిఫిట్స్‌తో 2 వేల 150 రూపాయల విలువైన షాపింగ్ వోచర్లు, కూపన్లను అందిస్తోంది.

ఇది కూడా చదవండి: Pushpa 2: దొంగలు కూడా ‘‘తగ్గేదే లే’’.. పుష్ప 2 సినిమా హాలులో దోపిడి..

ఈ ప్యాక్‌ కొనుగోలు చేసిన వారికి రూ.2150 విలువైన కూపన్లను జియో అందిస్తోంది. స్విగ్గీలో రూ.499 పైబడి చేసిన కొనుగోళ్లపై రూ.150 డిస్కౌంట్‌ ఇస్తోంది. ఈజ్‌ మై ట్రిప్‌లో విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.1500 డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు జియో పేర్కొంది. ఈ ప్లాన్‌ డిసెంబర్‌ 11 నుంచి జనవరి 11 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. మై జియో యాప్‌ నుంచి గానీ, జియో అధికారిక వెబ్‌సైట్‌, రిటైలర్ల దగ్గర రీఛార్జ్ చేసుకోవచ్చని జియో కంపెనీ తెలిపింది.

ఇది కూడా చదవండి: Pushpa 2 : రూ. 1000 కోట్ల క్లబ్ లో అల్లు అర్జున్.. ఇది కదా బ్రాండ్ అంటే.!

Show comments