ముఖేష్ అంబానీ నేతృత్వంలోని.. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖేష్ అంబానీ అడ్రస్‌తో ప్రారంభం కాగానే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో వృద్ధి కనబడింది. రెండు శాతానికి పైగా షేర్లు పెరిగాయి. ఈ సమావేశంలో.. రిలయన్స్ గ్రూప్ రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ అనే రెండు కంపెనీల ఐపీఓకి సంబంధించిన చిత్రాన్ని రిలయన్స్ ఛైర్మన్ చూయించారు. ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై సంస్థ దృష్టి సారించిందని, గతేడాది కొత్తగా 1.7 లక్షల ఉద్యోగాలు కల్పించామని ఛైర్మన్ అంబానీ చెప్పారు.
READ MORE: Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. తీవ్రత 5.7గా నమోదు, భారత్లోనూ ప్రకంపనలు
ఇదిలా ఉండగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ముకేశ్ అంబానీ భారీ ప్రకటన చేశారు. షేర్ హోల్డర్లకు రూ.1 చొప్పున ఒక బోనస్ షేరును జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కంపెనీ వాటాదారులకు 1:1 ప్రమాణంలో బోనస్ ఇష్యూను ప్రకటించారు. అంటే రిలయన్స్ యొక్క ఒక షేరు కలిగి ఉంటే మరోషేరు ఒక రూపాయికే ఇవ్వబడుతుంది. ఏజీఎం రోజున గురువారం మధ్యాహ్నం 1.45 గంటలకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇందుకోసం బోర్డు సభ్యులు సెప్టెంబర్ 5న సమావేశం కానున్నట్టు రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. వ్యాపార విస్తరణ, బలమైన ఆర్థిక పనితీరును దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ప్రకటన చేసింది. ముకేశ్ అంబానీ ఈ విషయాన్ని ఆర్ఐఎల్ ఏజీఎం (RIL AGM) లో తెలియజేశారు.