NTV Telugu Site icon

Realme narzo: రియల్‌మీ ఫోన్‌పై భారీ తగ్గింపు.. రూ. 10 వేలలోపే 50 ఎంపీ కెమెరా ఫోన్..

Real Me

Real Me

ప్రముఖ చైనా కంపెనీ రియల్ మీ ఎప్పటికప్పుడు జనాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా రిలీజ్ అయిన రియల్‌మీ నార్జో 60 ఎక్స్‌ స్మార్ట్ ఫోన్‌పై మంచి డీల్‌ అందిస్తోంది అమెజాన్.. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 14,999కాగా, 22 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 11,749కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. వీటితోపాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా రూ. వెయ్యి వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు…

ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 10 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇక రియల్‌మీ నార్జో 60 ఎక్స్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది..ఇక 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. 70 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్‌ కావడం ఈ ఫోన్‌ ప్రత్యేకత. బ్యాక్‌ ఫింటర్‌ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు.. అలాగే స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్స్‌ పవర్‌ ఫుల్ సూపర్‌ వూక్‌ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు..

కెమెరా విషయానికొస్తే సెల్ఫీ ప్రియులకు పండగే.. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ ఫీచర్‌ విషయానికొస్తే ఇందులో బ్లూటూత్‌, సెల్యూలార్‌, వైఫై, ట్రూ జీపీఎస్‌ వంటి ఫీచర్స్‌ను.. ఇకపోతే ఈ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ఫోన్‌లో పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను ఇచ్చారు.. ఈ ఫోన్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది..