మరోసారి వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)… రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు పెంచేసింది.. దీంతో.. ఇప్పటి వరకు 5.4 శాతంగా ఉన్న వడ్డీ రేటు.. 5.9 శాతానికి పెరిగింది… ఈ ఏడాదిలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం ఇది నాలుగో సారి.. ఇక, మే నెల నుంచి ఇప్పటి దాకా 140 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ.. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేందుకు వడ్డీ రేట్లను పెంచినట్టు ఆర్బీఐ చెబుతోంది.. వడ్డీ రేట్ల పెంపుతో గృహ, వాహన రుణాలతో పాటు ఇతర రుణాలు కూడా మరింత భారం కానున్నాయి.. పెరిగిన వడ్డీరేట్ల ప్రభావం ఈఎంఐలపై పడనుంది.. మేలో 40 బేసిస్ పాయింట్లు, జూన్ మరియు ఆగస్టులలో 50 బేసిస్ పాయింట్లు పెంచింది..
Read Also: Hyderabad: ఎంఎంటీఎస్‌కు తప్పిన పెను ప్రమాదం..
మరోవైపు.. ఇవాళ పెంచిన రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు.. తక్షణమే అమలులోకి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. కాగా, డాలర్ బలపడటంతో ఈ వారం ప్రారంభంలో ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది రూపాయి మారకం విలువ, ఇక, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేందుకే ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతుందని మార్కెట్ నిపుణులు ముందుగానే అంచనా వేశారు.
