UPI Transactions: యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే గంట ఆగాల్సిందే.. ఆర్బీఐ కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ చెల్లింపుల్లో వేగానికి మారుపేరైన యూపీఐ (UPI) లావాదేవీల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలక మార్పును తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతం మనం ఎవరికైనా డబ్బులు పంపిస్తే అవి క్షణాల్లో అవతలి వ్యక్తి ఖాతాలోకి వెళ్లిపోతున్నాయి. అయితే, ఈ వేగాన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. ఒకసారి డబ్బులు పంపాక వాటిని వెనక్కి తీసుకోవడం దాదాపు అసాధ్యం. అందుకే.. పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీల (High-value transfers) విషయంలో సుమారు ఒక గంట పాటు ‘కూలింగ్-ఆఫ్ పీరియడ్’ (విరామ సమయం) ప్రవేశపెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది.
ఎందుకు ఈ మార్పు.. ?
Also Read
- Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్‌కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
- UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
- Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
పొరపాటున ఎవరికైనా తప్పుడు అడ్రస్‌కు డబ్బులు పంపితే, ఆ గంట లోపు లావాదేవీని ఆపే అవకాశం (Reversal window) ఉంటుంది. చాలామందిని ఫోన్ల ద్వారా భయపెట్టో, ఆశ చూపించో నేరగాళ్లు డబ్బులు పంపించుకుంటారు. ఈ గంట సమయం ఉంటే, బాధితులు ఆలోచించుకుని ఆ ట్రాన్సాక్షన్‌ను రద్దు చేసుకోవచ్చు. ఈ నిబంధన కేవలం పెద్ద మొత్తంలో ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి పంపే డబ్బులకే వర్తిస్తుంది. మీరు దుకాణాల్లో వస్తువులు కొన్నా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చిన్నపాటి చెల్లింపులు చేసినా అవి ఎప్పటిలాగే తక్షణమే జరుగుతాయి.
Also Read:RR Manager: రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌కు రూ. లక్ష జరిమానా.. బుడ్డొడు (వైభవ్ సూర్యవంశీ) జస్ట్ మిస్..
డిజిటల్ చెల్లింపులు వేగంగా ఉండటమే కాదు, సురక్షితంగా ఉండటం కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ దాడులను అరికట్టడానికి ఈ “గోల్డెన్ అవర్” (మొదటి గంట) ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు పంపేటప్పుడు ఆందోళన చెందకుండా, ధీమాగా ఉండటానికి ఇది దోహదపడుతుంది. మొత్తానికి.. యూపీఐ వేగాన్ని తగ్గించడం కంటే, వినియోగదారుల డబ్బుకు భద్రత కల్పించడమే ఆర్బీఐ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్‌నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!