Site icon NTV Telugu

యూనియన్ బ్యాంక్‌కు RBI భారీ జరిమానా

నిబంధనలను ఉల్లంఘించినందుకు యూనియన్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. ఇటీవల యూనియన్ బ్యాంక్‌కు సంబంధించి 2019 స్టాట్యూటరీ ఇన్‌ఫెక్షన్ ఫర్ సూపర్‌వైజరీ ఎవాల్యూయేషన్‌ను ఆర్‌బీఐ నిర్వహించింది. ఆర్‌బీఐ నిబంధనల్లో భాగంగా ఏ బ్యాంకు అయినా కస్టమర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలను లేదా లావాదేవీలకు సంబంధించిన అంశాలను బహిర్గతం చేయడానికి వీల్లేదు.

Read Also: కేవలం 35 పైసలుతో రూ.10 లక్షల ఇన్సూరెన్స్ పొందండి

అయితే యూనియన్ బ్యాంక్ ఈ నిబంధనలను ఉల్లంఘించడంతో రూ.కోటి జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఉన్నప్పటికీ ఖాతాను రెడ్ ఫ్లాగ్ ఖాతాగా వర్గీకరించడంలో యూనియన్ బ్యాంక్ నిబంధనలు పాటించడంలేదని తమ ఎవాల్యూయేషన్‌లో తేలినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. అంతేకాకుండా యూనియన్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో భద్రతా రసీదుల (ఎస్‌ఆర్‌లు) కేటాయింపులను బహిర్గతం చేయడంలో విఫలమైందని ఆర్‌బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో తాము ఎందుకు జరిమానా విధించకూడదో కారణం చూపాలని ఈనెల 25న ఆర్‌బీఐ నోటీసులు జారీ చేసింది.

Exit mobile version