Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Rbi Hiked Repo Rate To Tackle Inflation

RBI Repo Rate: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మరో సారి వడ్డీ రేట్లు పెరిగాయ్..

Published Date :June 8, 2022 , 10:55 am
By Mahesh Jakki
RBI Repo Rate: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మరో సారి వడ్డీ రేట్లు పెరిగాయ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మరో సారి పెంచింది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు రెపోరేటును పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మూడు రోజుల చర్చల అనంతరం ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) కీలక నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం రెపో రేటును పెంచి 4.90 శాతంగా ప్రకటించింది.రెపో రేటు లేదా తిరిగి కొనుగోలు చేసే ఎంపిక రేటు అనేది ఆర్‌బీఐ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రెపో రేటు ముఖ్యమైన సాధనంగా పరిగణిస్తున్నారు.ద్రవ్యోల్బణం వల్ల ఇంధనంతో సహా పలు వస్తువుల ధరలు పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలను మరింతగా పెంచింది.
రెపో రేటును గత నెలలోనే 40 బేసిస్‌ పాయింట్ల మేర పెంచగా, తాజాగా మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచారు. దీంతో రెపో రేటు 4.90 శాతానికి చేరింది. అధిక ద్రవ్యోల్బణం దృష్ట్యా ద్రవ్య విధాన వైఖరిని క్రమక్రమంగా కఠినతరం చేయనున్నట్లు ఆర్‌బీఐ గతంలోనే సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్‌బీఐ ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంది. ఇలా క్రమంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆర్‌బీఐ రెపో రేటును 5.6 శాతానికి చేరుస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.
పరపతి విధాన నిర్ణయాలకు ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకునే రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 7.79 శాతానికి చేరింది. ఇది 8ఏళ్ల గరిష్ఠ స్థాయి. అయితే ద్రవ్యోల్బణం పెరగడానికి కమొడిటీలు, ముడి చమురు ధరలే కారణం. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు ఇందుకు అధిక కారణమన్నది గమనార్హం. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 13 నెలలుగా రెండంకెల స్థాయిల్లో నమోదవుతూ, ఏప్రిల్‌లో రికార్డు గరిష్ఠమైన 15.08 శాతాన్ని చేరింది. ఇవన్నీ రేట్ల పెంపునకు దారితీసిన అంశాలే.
కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ సవరించిన నేపథ్యంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం కానుంది. ఇక ఇప్పటికే రుణం తీసుకున్న వారికి బ్యాంకులు ఈఎంఐలలో ఎలాంటి మార్పూ చేయనప్పటికీ ఈఎంఐలు కట్టాల్సిన నెలల సంఖ్య పెరుగుతుంది. ఆ లెక్కన సుదీర్ఘకాలం పాటు ఈఎంఐలు కట్టినప్పుడు ఆ విధంగా కట్టే వడ్డీ మొత్తం పెరుగుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • inflation
  • interest rate
  • RBI
  • rbi governer shakthikantha das
  • repo rate

తాజావార్తలు

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • RR vs MI: “వైభవ్ vs బుమ్రా”.. తొలిసారి యంగ్ సెన్సేషన్, యార్కర్ కింగ్ మధ్య అసలైన ఫైట్!

  • స్టైలిష్ లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో Volkswagen Taigun.. ఈ SUV మార్కెట్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..?

  • Allu Arjun Atlee Movie: ష్.. అంతా గప్ చుప్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions