NTV Telugu Site icon

RBI: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు యథాతథం

Rbi

Rbi

ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ సారి కూడా రేపో రేటులో ఎలాంటి మార్పులు తీసుకురాలేదని ఆయన వెల్లడించారు. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నారు. ఎంపీసీ గత 10 సమావేశాల్లో కూడా రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. 11వ సమావేశంలో కూడా 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. రెపో రేటు అంటే ఆర్‌బీఐ బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు. దీని గురించి తెలుసుకుందాం..

READ MORE: Bitcoin : కుప్పకూలిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ.. 24గంటల్లో రూ.10లక్షలు నష్టం

రేపో రేటు అంటే ఏంటి?
ఆర్‌బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు వసూలు చేసే రేటును రెపో రేటు అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. స్వల్ప కాలికంగా దేశంలో ఆర్థిక పరిస్ధితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెపో రేటును నిర్ణయిస్తారు. రెపో రేటును తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులకు త‌క్కువ‌కే రుణాలు వ‌స్తాయి. ఈ ప్రభావంతో కంపెనీలకు, వ్యక్తులకు రుణాల వడ్డీ రేటును వాణిజ్య బ్యాంకులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి రేపో రేటు తగ్గించినా దానిని సామాన్యుల‌కు బ‌ద‌లాయించేందుకు బ్యాంకులు ఆసక్తి చూపకపోవచ్చు. ఇందుకు బ‌దులుగా ఆదాయం పెంచుకోవాలని చూస్తాయి.

READ MORE:Fake Medical Degrees : కేవలం రూ.60 వేలకే నకిలీ డాక్టర్ సర్టిఫికేట్.. ఎక్కడంటే?

Show comments