Paytm Payments Bank: బిగ్‌షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. బ్యాంక్ లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తోందన్న కారణంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) బ్యాంకింగ్ లైసెన్స్‌ను ఆర్బీఐ అధికారికంగా రద్దు చేసింది. దీనివల్ల ఇకపై ఈ బ్యాంక్ ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుండదు. నేటితో బ్యాంక్ కార్యకలాపాలు ముగించాలని ఆర్బీఐ పేర్కొంది.
అసలు ఏం జరిగింది..?
Also Read
చాలా కాలంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పనితీరుపై ఆర్బీఐ నిఘా పెట్టింది. బ్యాంకింగ్ నిబంధనలను పాటించకపోవడం, కస్టమర్ల వివరాల నమోదు (KYC)లో లోపాలు ఉండటం వంటి కారణాలతో గతంలోనే ఆర్బీఐ ఈ బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అయితే.. ఆర్బీఐ సూచించిన మార్పులను చేయడంలో బ్యాంక్ విఫలమైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కస్టమర్లపై ప్రభావం ఏంటి..?
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదును కస్టమర్లు ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. కానీ.. కొత్తగా డబ్బులు డిపాజిట్ చేయడానికి అనుమతి ఉండదు. మీ పేటీఎం వాలెట్ లేదా ఫాస్టాగ్‌లో ఇప్పటికే ఉన్న బ్యాలెన్స్‌ను మీరు వాడుకోవచ్చు. అయితే, లైసెన్స్ రద్దు నేపథ్యంలో వీటిని రీఛార్జ్ చేయడం సాధ్యం కాదు.
సాధారణ పేటీఎం యాప్ (UPI సేవలు) యథావిధిగా పనిచేస్తుంది. ఎందుకంటే యూపీఐ సేవలను ఇతర బ్యాంకుల సహకారంతో పేటీఎం అందిస్తోంది. కేవలం ‘పేమెంట్స్ బ్యాంక్’ సేవలు మాత్రమే నిలిచిపోతాయి. బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత, కస్టమర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆర్బీఐ ఈ నిర్ణయం ద్వారా మరోసారి స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు తమ ఖాతాలోని నగదును వేరే బ్యాంకులకు మార్చుకోవడానికి అవకాశం ఉంది.
తాజావార్తలు
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..