NTV Telugu Site icon

PURE EV: పండగ వేళ ప్యూర్ ఈవీ బంపరాఫర్.. ఏకంగా రూ. 40 వేల క్యాష్‌బ్యాక్!

Pure

Pure

పండగల వేళ ఆటోమొబైల్ కంపెనీలు తమ సేల్స్ ను పెంచుకునేందుకు ఆఫర్స్ ను ప్రకటిస్తూ ఉంటాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తుంటాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ప్యూర్ ఈవీ కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఏకంగా రూ. 40 వేల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ప్యూర్ ఇవి ‘ప్యూర్ పర్ఫెక్ట్ 10’ రిఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. శివరాత్రి, హోలీ, ఉగాది, రంజాన్ ఈద్‌లతో సహా రాబోయే పండుగ సీజన్‌ లలో కస్టమర్లకు చేరువయ్యేందుకు దేశవ్యాప్తంగా ఈవీల వినియోగాన్ని పెంచేందుకు ఈ ఆఫర్ ఉపయోగపడనున్నది.

Also Read:Harish Rao : “ఓ మూర్ఖులారా… సిద్ధిపేటకు వచ్చి గోదావరి జలాలు చూసి కళ్లు తెరవండి!”

PURE Perfect 10 రెఫరల్ ప్రోగ్రామ్ ప్రస్తుత PURE EV కస్టమర్‌లకు, అలాగే మార్చి 31, 2025 నాటికి లేదా సంబంధిత అవుట్‌లెట్‌లలో స్టాక్‌లు అయిపోయే వరకు PURE EV వాహనాన్ని కొనుగోలు చేసే కొత్త కస్టమర్‌లకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు PURE EV వాహనాన్ని కొనుగోలు చేయమని స్నేహితులు, కుటుంబ సభ్యులను సూచించడం ద్వారా రూ. 40,000 వరకు క్యాష్‌బ్యాక్ రివార్డ్‌లను పొందవచ్చు. ఇప్పటికే ఉన్న కస్టమర్లతో పాటు కొత్త PURE EV కస్టమర్లందరూ వారి రిజిస్టర్డ్ వాట్సాప్ నంబర్ ద్వారా 10 ప్రత్యేకమైన రిఫెరల్ కోడ్‌లు వస్తాయి.

Also Read:Krishna Mohan Reddy : “ఫొటో కల్లోలం: ఎమ్మెల్యేనా? పోస్టర్ స్టార్ నా?”

రిఫర్ చేయబడిన వారు ప్యూర్ ఈవీని కొనుగోలు చేస్తే రిఫరర్ కి రూ. 4,000 క్యాష్‌బ్యాక్ వోచర్‌లు వస్తాయి. గరిష్టంగా పది మంది కొత్త కొనుగోలుదారుల రిఫర్ చేయొచ్చు. రిఫరల్స్ ద్వారా సంపాదించిన క్యాష్‌బ్యాక్ వోచర్‌లను సర్వీస్, విడిభాగాల అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. కస్టమర్‌లు అప్‌గ్రేడ్‌లు, వెహికల్ ఎక్సేంజ్, బ్యాటరీ మార్పిడి కోసం కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. లేదా రిఫర్ చేయబడిన స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుని ప్యూర్ EV కొనుగోలుపై ప్రత్యక్ష క్యాష్ డిస్కౌంట్ లను పొందవచ్చు.