NTV Telugu Site icon

Prasar Bharati: ఓటీటీ ప్రియులకు ప్రసార భారతి శుభవార్త.. ఇకపై ఇవన్నీ ఫ్రీ!

Ott

Ott

ఓటీటీ ప్రియులకు ప్రసార భారతి అదిరిపోయే శుభవార్త చెప్పింది. మన దేశంలో ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ఎలాంటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. ఇంట్లోనే కూర్చుని.. కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు ఓటీటీ ఇప్పుడు మంచి ప్లాట్‌ఫామ్. నచ్చిన సినిమాలు, వినోద కార్యక్రమాలు చూసేందుకు ఎక్కువగా ఓటీటీలనే ఆశ్రయిస్తున్నారు. అలాంటి ఓటీటీ లవర్స్‌కి కేంద్ర ప్రభుత్వ ప్రసార భారతి సొంత ఓటీటీని తీసుకొచ్చింది. వేవ్స్ పేరుతో సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆవిష్కరించింది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా యూజర్లకు అద్భుతమైన అవకాశం అందిస్తోంది. ఓటీటీ వేదికగా రామాయణం, మహాభారతం వంటి వాటిని ఉచితంగా అందిస్తామని తెలిపింది.

ఇది కూడా చదవండి: Vishwak Sen: పాపులర్ సింగర్ ను ‘వాడు’ అనేసి నాలుక కరుచుకున్న విశ్వక్

బుధవారం గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం వేదికగా ప్రసార భారతి తమ కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌‌ను ఆవిష్కరించింది. ఓటీటీ ద్వారా రామాయణం, మాహాభారతంతో పాటు రేడియో కార్యక్రమాలు, భక్తి పాటలు, ఆటలు, ఈ-బుక్స్ వంటివి సైతం ఉచితంగానే అందిస్తామని వెల్లడించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ప్రస్తుతం 65 లైవ్ ఛానెల్స్ అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. పెద్ద వారి కోసం అలనాటి చిత్రాలు, మదురమైన పాటలు ఇందులో ఉన్నాయని తెలిపింది. వీటితో పాటు పిల్లల కోసం వినోద కార్యక్రమాలైన ఛోటా భీమ్, అక్బర్ బీర్బల్, తెలనాలీరామ్ వంటి యానిమేటెడ్ సినిమాలు సైతం అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఇటీవల బీఎస్ఎన్‌ఎల్ కూడా లైవ్ టీవీని ప్రారంభించింది. డేటా లేకుండానే ఉచితంగా ఛానల్స్ చూసే అవకాశం కల్పించింది.

ఇది కూడా చదవండి: President Droupadi Murmu: కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది: రాష్ట్రపతి

Show comments