Site icon NTV Telugu

Post Office Scheme : పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. కేవలం రూ.500 పెట్టుబడితో రూ. 4లక్షలు ఆదాయం..

Post Office

Post Office

ఎటువంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని ఇచ్చే ఎన్నో పథకాలను ప్రభుత్వం అందిస్తుంది.. అందులో పోస్టాఫీస్ అందిస్తున్న ఫథకాలకు మంచి ఆదరణ ఉంది.. ఇప్పటివరకు ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది.. అవన్నీ కూడా మంచి రాబడిని అందిస్తున్నాయి.. అందులో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి.. ఈ పథకం బెనిఫిట్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

ఇక ఈ పథకంలో సంవత్సరానికి కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఇలా దాదాపు 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. మీకు కావాలంటే, మెచ్యూరిటీ తర్వాత, మీరు 5 సంవత్సరాల బ్లాక్‌లో ఖాతాను పొడిగించవచ్చు. ఈ పథకంలో వడ్డి ఎక్కువ అసలు వడ్డి కలిపి మొత్తం 14 లక్షలు వరకు ఆదాయం పొందవచ్చు.. ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలో ఇప్పుడు వివరంగా ఒకసారి చూద్దాం..

ఉదాహరణకు ఈ పథకంలో మీరు నెలకు రూ.500 పెట్టుబడి పెట్టాలి. అలా ఇన్వెస్ట్ చేస్తే మీరు ఏటా రూ. 6,000 ఇన్వెస్ట్ చేస్తారు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. అటువంటి పరిస్థితిలో, ఈ పథకంలో ప్రతి నెలా రూ. 500 డిపాజిట్ చేయడం ద్వారా, మీరు 7.1 శాతం వడ్డీతో 15 సంవత్సరాలలో రూ. 1,62,728 జోడించవచ్చు. అలాగే మరో 5.5 ఏళ్లు పొడిగిస్తే 20 ఏళ్లలో రూ.2,66,332, 25 ఏళ్లలో రూ.4,12,321వరకు మీరు చివరకు పొందవచ్చు.. ఇంకా పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి..

Exit mobile version