Site icon NTV Telugu

Post Office Super Plan : పోస్టాఫీస్ సూపర్ ప్లాన్.. రూ. 333 డిపాజిట్ చేస్తే రూ.17 లక్షలు మీ సొంతం..

Postoffice

Postoffice

ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్ ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే పథకాలను ఎన్నో అమలు చేస్తుంది.. తాజాగా మరో అద్భుతమైన ప్లాన్ ను అందిస్తుంది.. ఆ ప్లాన్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్ లలో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి.. ఈ స్కీమ్ లో రూ.333 డిపాజిట్ చేస్తే చివరికి మీ చేతికి రూ. 17 లక్షలు సొంతం చేసుకోవచ్చునని చెబుతున్నారు.. ఈ పథకంపై 6.7 శాతం బలమైన చక్రవడ్డీ అందిస్తోంది..ఇందులో పెట్టుబడిపై భద్రతకు ప్రభుత్వమే హామీ ఇస్తుంది.. ఈ స్కీమ్ లో భారీ ప్రయోజనాలను పొందడంతో పాటుగా డిపాజిట్ ను సరైన టైం కు కట్టాలని గుర్తుంచుకోండి..

ఈ పథకంలో రోజుకు రూ. 333 పెట్టుబడి పెడితే, ఈ మొత్తం ప్రతి నెలా దాదాపు రూ. 10,000 అవుతుంది.. అలా ఏడాది పొడవునా కడితే రూ.1.20 లక్షలు అవుతుంది. అలాగే ఐదేళ్లు కడితే మీకు రూ.6 లక్షలు అవుతుంది.. 6.7 శాతం చొప్పున చక్రవడ్డీని పరిశీలిస్తే, అది రూ. 1,13,659 అవుతుంది అంటే మీ మొత్తం రూ. 7,13,659 అవుతుంది. అదే పదేళ్లు మీరు కడితే మీకు వడ్డీతో కలిపి రూ.17 లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు..

Exit mobile version