Post Office Scheme: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ. 5 లక్షలు లాభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎటువంటి రిస్క్ లేకుండా లాభాలను పొందాలని అనుకొనేవారు పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ అనే చెప్పాలి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు.. పోస్టాఫీస్‌లో పలు రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మనం ఇప్పుడు టైమ్ డిపాజిట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను రెట్టింపు చేసుకోవచ్చు. అయితే దీని కోసం దీర్ఘ కాలం వేచి ఉండాల్సి ఉంటుంది.. అయితే అధిక లాభాలు ఉండటంతో ఎక్కువ మంది వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు..
మీరు పోస్టాఫీస్‌లో ఎస్బీఐ కన్నా ఎక్కువ వడ్డీ సొంతం చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్‌లో ఐదేళ్ల ఎఫ్డీలపై వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంది. అయితే మీకు పోస్టాఫీస్‌లో ఐదేళ్ల ఎఫ్డీలపై 7.5 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. అలాగే మీరు ఏడాది టెన్యూర్‌లో డబ్బులు దాచుకోవాలని చూస్తే వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది. అదే రెండేళ్ల టెన్యూర్ అయితే 7 శాతం, మూడేళ్ల టెన్యూర్‌పై కూడా 7 శాతం వడ్డీ పొందొచ్చు.. అంటే ఉదాహరణకు మీరు పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లలో డబ్బు దాచుకోవాలని అనుకుంటే.. మీ ఇన్వెస్ట్మెంట్ 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం అయితే 114 నెలల్లో రెట్టింపు అవుతుంది. మీరు రూ. 5 లక్షలు పెట్టాలని అనుకున్నారు. వడ్డీ రేటు 7.5 శాతం. మెచ్యూరిటీ పీరియడ్ 5 ఏళ్లు. మెచ్యూరిటీ సమయంలో మీకు రూ. 7.25 లక్షలు వస్తాయి. వడ్డీ రాబడి రూ. 2.25 లక్షలుగా ఉంది. అదే రూ.10 లక్షలు పెడితే.. మీకు మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 5 లక్షల వరకు లాభాన్ని పొందవచ్చు..
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
స్కీమ్‌లో రూ.1000 నుంచి డబ్బలు పొదుపు చేయొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. వడ్డీ మొత్తాన్ని త్రైమాసికం చొప్పున లెక్కిస్తారు. కానీ ఏడాది ప్రాతిపదికన చెల్లిస్తారు. ఇక మెచ్యూరిటీ సమయంలోనే మీరు పెట్టిన డబ్బులు, వచ్చిన వడ్డీని ఒకేసారి పొందొచ్చు. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు నచ్చిన టెన్యూర్ ఎంచుకోవచ్చు.. మీరు డబ్బులను పెట్టేదాన్ని బట్టి ఆదాయం ఉంటుంది.. మీరు ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందొచ్చు. సెక్షన్ 80సీ కింద ఈ ప్రయోజనం పొందొచ్చు.. అలాగే లోన్ పొందే అవకాశం కూడా ఉంది..
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?