PPF Sscheme: దేశంలో చాలా మందికి పోస్ట్ ఆఫీస్ పథకాలపై సరైన అవగాహన లేదు. మీలో ఎంత మందికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనే పోస్టాఫీస్ అందించే ప్రభుత్వ పథకం గురించి తెలుసు. వాస్తవానికి మీకు ఈ పథకం గురించి తెలిస్తే.. ప్రతి నెల ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి ఈ పథకంలో డబ్బులు పెట్టిన వారికి 7.1% వార్షిక వడ్డీ రేటు వస్తుంది.
READ ALSO: Off The Record: హైకమాండ్కు ఉత్తరాంధ్ర నేతలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్?
మీ డబ్బు ఎక్కడికి పోదు..
ఈ పథకంలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే పెట్టుబడి పెట్టిన మొత్తం డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. అలాగే ఇందులో మీరు పెట్టుబడి పెడితే రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా పొందుతారు. మీరు PPFలో ఏడాదికి రూ.1.5 లక్షలు 25 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టి, 15+5+5 సంవత్సరాల వ్యూహాన్ని ఉపయోగించి దానిని పెంచుకుంటే.. మీరు కూడపెట్టిన మొత్తం రూ.1.03 కోట్లకు పెరుగుతుంది. దీని అర్థం సాధారణ పొదుపులు క్రమంగా మిమ్మల్ని ఎటువంటి స్టాక్ మార్కెట్ రిస్క్ లేకుండా లక్షాధికారిగా మారుస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
మీరు కూడబెట్టుకున్న డబ్బులు రూ.1.03 కోట్లకు చేరుకున్నప్పుడు, దానిపై వచ్చే వార్షిక వడ్డీ సుమారు రూ.7.31 లక్షలు ఉంటుంది. అంటే మీకు ప్రతి నెలా సుమారు రూ.61 వేలు వడ్డీ రూపంలో సంపాదిస్తారు. అంటే పదవీ విరమణ తర్వాత కూడా మీ జేబులో క్రమం తప్పకుండా ఆదాయం వచ్చి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. PPF అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే వడ్డీ, ఉపసంహరణలు రెండూ పూర్తిగా పన్ను రహితంగా ఉంటాయి.
ఇంకా ఇది ప్రభుత్వ హామీ పథకం. అంటే మార్కెట్ ఎంత అస్థిరంగా ఉన్నా మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఈ పథకం కింద మీరు కేవలం రూ.500 తో ఖాతాను తెరవచ్చు. ఇందులో ఉన్న మరొక విషయం ఏమిటంటే.. మీరు ఈ పథకంలో మైనర్ పేరు మీద కూడా పెట్టుబడి పెట్టవచ్చు. దీని అర్థం ఇది మీ పదవీ విరమణకు మాత్రమే కాకుండా మీ పిల్లల భవిష్యత్తుకు కూడా గొప్ప ఎంపిక అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: SBI Downtime: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. రేపు ఈ సేవలు బంద్ కానున్నాయి!
