Site icon NTV Telugu

NSC Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో వడ్డీతోనే లక్షలు సంపాదించవచ్చు..!

Nsc Scheme

Nsc Scheme

NSC Scheme: కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా పొదుపు చేయాలనేది తెలిసినప్పుడే ఆ సంపాదన ఆదా అవుతుంది. మీ సంపాదనకు పూర్తి భద్రత, కచ్చితమైన రాబడిని అందించే పెట్టుబడి పథకాల కోసం చూస్తున్నట్లయితే, పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకం ఒక మంచి ఎంపికగా చెబుతున్నారు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని, భవిష్యత్తు కోసం సురక్షితమైన నిధిని నిర్మించాలనుకునే వారికి ఈ పథకం అనువైనదిగా పేర్కొంటున్నారు. ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకం నమ్మదగినది మాత్రమే కాకుండా, పన్నులను ఆదా చేయడానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

READ ALSO: Sunny Leone : న్యూఇయర్ ట్రీట్’కి రెడీ అయిన సన్నీ

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకం అనేది భారత ప్రభుత్వం మద్దతుతో పోస్ట్ ఆఫీస్ అందించే ఒక ప్రసిద్ధ చిన్న పొదుపు పథకం. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడులు మార్కెట్ హెచ్చుతగ్గులకు ప్రభావితం కావు, అలాగే ముందుగా నిర్ణయించిన రాబడిని పొదుపు చేసిన వారికి అందిస్తాయి. అందుకే ఈ పథకం మధ్యతరగతి, పదవీ విరమణ కోసం ప్రణాళిక వేసేవారికి చాలా ఉపయోగపడేదిగా చెబుతున్నారు. ఈ పథకాన్ని కనీసం ₹1,000తో ప్రారంభించవచ్చు, దీంట్లో గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. అలాగే ఈ పథకంలో 5 సంవత్సరాలు పొదుపు చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ప్రభుత్వం NSC పై 7.7% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ పథకంలో రూ.10 లక్షలు డిపాజిట్ చేసిన పెట్టుబడిదారుడు ఐదు సంవత్సరాల తర్వాత సుమారు రూ.14.49 లక్షలు పొందుతాడు. అంటే ఇందులో పొదుపు చేసిన వారు కేవలం వడ్డీ రూపంలోనే దాదాపు రూ.4.49 లక్షలు ఆర్జిస్తారు. నిజానికి ఈ పథకంలో వడ్డీని ఏటా చక్రవడ్డీ చేస్తారు, దీనికి చక్రవడ్డీ ప్రయోజనాన్ని అందిస్తారు, ఇది పెట్టుబడిదారుడికి వచ్చే మొత్తం రాబడిని మరింత పెంచుతుంది. NSCలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇందులో పన్ను ఆదా అవుతుంది. ఈ పథకంలో పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అవకాశం ఉంది.

NSC ఖాతాను కేవలం భారతీయులు మాత్రమే తెరవగలరు. NRIలు, కంపెనీలు, ట్రస్టులు, HUFలు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు కాదు. ఇందులో పొదుపు చేయాలనుకునే వాళ్లు వారి స్వంత పేరుతో లేదా మైనర్ పిల్లల తరపున కూడా ఖాతాను తెరవవచ్చు. అలాగే ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి ఉమ్మడి ఖాతాను కూడా తెరవవచ్చు.

READ ALSO: James Cameron – Rajamouli: జక్కన్నకు జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్.. ఏంటో తెలిస్తే షాక్ కావాల్సిందే!

Exit mobile version