POCO F4 5G: భారత మార్కెట్‌లోకి పోకో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి అత్యాధునిక టెక్నాలజీ యుగంలో ప్రముఖ మొబైల్ దిగ్గజ సంస్థలు తమ వైపు కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ మొబైల్ సంస్థ పోకో ‘ఎఫ్4 5జీ’ మొబైల్‌ను రంగంలోకి దించింది. పోకో బ్రాండింగ్‌తో ఫ్లాట్ బాడీ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఇది అందుబాటులోకి రానుంది. అంతేకాదు వ్లాగ్ మోడ్ కొత్త తరం ఫిల్మ్ మేకర్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనున్నట్లు పోకో ట్వీట్టర్ ద్వారా వెల్లడించింది. ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు రెడ్‌మి కే40ఎస్‌కి దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు.
దీంతో పాటు 7లేయర్ గ్రాఫైట్ షీట్‌ల లిక్విడ్ కూల్ 2.0, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు , 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉంటాయట. బ్లాక్ అండ్ గ్రీన్ రంగులలో ఇది లభ్యం కానుంది. ఆండ్రాయిడ్ 12 OS ఆధారిత ఎంఐయుఐ, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన అమెలెడ్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC, 12 జీబీ ర్యామ్, 126 జీబీ స్టోరేజ్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 64 ఎంపీ మెయిన్‌గా, ట్రిపుల్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తోంది.
Also Read
- PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
దీంతోపాటు పోకో ఎక్స్ 4జీటీ అనే మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేయనున్నట్టు పోకో ట్విటర్ ద్వారా వెల్లడించింది. పోకో ఎక్స్ 4 జీటీ ఫీచర్లు… 6.6అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 8100 SOC, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 64ఎంపీ రియర్ కెమెరా, 5080 ఎంఏహెచ్ బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అయితే భారత్‌లో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అందుకోసం టెలికాం దిగ్గజ సంస్థలు కసరత్తులు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్‌లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!