Site icon NTV Telugu

PM Modi: వరల్డ్‌లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడమే లక్ష్యం.. నిర్మలమ్మ బడ్జెట్‌పై మోడీ వ్యాఖ్య

Modi

Modi

పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని మోడీ విమర్శలు ప్రశంసలు కురిపించారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారడమే లక్ష్యం కాదని.. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే లక్ష్యం అని ప్రధాని మోడీ అన్నారు.

ఈ బడ్జెట్ అంతా మానవ కేంద్రీకృతమైందని.. విప్లవాత్మక సంస్కరణలతో భారతదేశం పునాదిని బలోపేతం చేస్తుందన్నారు. చారిత్రాత్మకమైన బడ్జెట్‌గా అభివర్ణించారు. దీర్ఘకాలిక వృద్ధిని వేగవంతం చేయడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. బడ్జెట్‌లోని ప్రతిపాదనలు ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరుస్తాయని.. అంతేకాకుండా పౌరులను శక్తివంతం చేస్తాయన్నారు. భారతదేశ యువత కొత్త శిఖరాలను అధిరోహించడానికి కొత్త అవకాశాలను ఇస్తాయని పేర్కొన్నారు.

భారతదేశంలోని ధైర్యవంతులైన, ప్రతిభావంతులైన యువతకు ఎదగడానికి ఓపెన్ ఆకాశాలను అందిస్తాయని చెప్పారు. భారతదేశంలోని 140 కోట్ల మంది పౌరులు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంటుందన్నారు. ఈ బడ్జెట్ అపార అవకాశాలకు దారితీసే మార్గం అని.. ఇది నేటి ఆకాంక్షలను వాస్తవంగా మారుస్తుందని పేర్కొన్నారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు పునాదిని బలపరుస్తుందని ప్రధాని మోడీ అన్నారు. మహిళా సాధికారతకు నిదర్శనంగా ఉందని.. వరుసగా తొమ్మిదిసార్లు దీనిని లోక్‌సభలో ప్రవేశపెట్టి నిర్మలాసీతారామన్ రికార్డు సృష్టించారని ప్రధాని మోడీ కొనియాడారు.

Exit mobile version