NTV Telugu Site icon

చ‌మురు ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌నున్నాయా?

దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు భారీగా పెరిగిన సంగ‌తి తెలిసిందే.  దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధ‌ర‌లు వంద‌కు పైగా ఉన్న‌ది.  దీంతో సామాన్య ప్ర‌జ‌లు వాహ‌నాలు బ‌య‌ట‌కు తీయాలంటే ఆలోచిస్తున్నారు.  పెట్రోల్ ధ‌ర‌ల‌ను వెంట‌నే త‌గ్గించాల‌ని కేంద్రంపై ప్ర‌తిప‌క్షాలు ఒత్తిడి చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  మ‌రోవైపు పెట్రోల్‌, డీజిల్ ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకురావాల‌ని నేతులు డిమాండ్ చేస్తున్నారు.  అయితే, పెట్రోల్ ధ‌ర‌ల నియంత్ర‌ణ త‌మ చేతుల్లో లేద‌ని ఇప్ప‌టికే కేంద్రం స్ప‌ష్టం చేసింది.  అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ఉత్ప‌త్తిని త‌గ్గించ‌డంతో చ‌మురు ధ‌ర‌లు పెరుగుతున్నాయి.  

Read: జావెలిన్ త్రోలో అదరగొట్టిన నీరజ్ చోప్రా

అయితే, ఈ నెల నుంచి ముడి చ‌మురు ఉత్ప‌త్తిని పెంచేందుకు ఒపెక్ దేశాలు సిద్ధం అవుతున్నాయి.  ముడి చమురు ఉత్ప‌త్తి పెరిగితే బ్యారెక్ ధ‌ర 65 డాల‌ర్లకు చేరుకునే అవ‌కాశం ఉంటుంది.  దీంతో పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు రూ.4 నుంచి రూ.5 వ‌ర‌కు త‌గ్గే అవ‌కాశం ఉంటుంది.  అయితే, ధ‌ర‌ల త‌గ్గింపు అన్న‌ది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల చేతుల్లో ఉంటాయి.  అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గిన‌పుడు ఆయిల్ కంపెనీలు సాధార‌ణంగా ధ‌ర‌లు త‌గ్గిస్తుంటాయి. అదే జ‌రిగితే కొంత మేర వినియోగ‌దారుల‌కు ల‌బ్దిచేకూరిన‌ట్టే అవుతుంది.