Site icon NTV Telugu

Petrol- Diesel Rates Drop: భారీగా తగ్గనున్న చమురు ధరలు.. లీటర్ పెట్రోల్ ఎంతో తెలుసా..?

Petrol

Petrol

Petrol- Diesel Rates Drop: 2026వ సంవత్సరంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిపోర్టులో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు పెరగడం, డిమాండ్ తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ధర జూన్ 2026 నాటికి బ్యారెల్‌కు 50 డాలర్లకి పడిపోవచ్చని అంచనా. యూఎస్ ఇంధన సమాచార సంస్థ (US EIA) కూడా 2026 మొదటి త్రైమాసికంలో ధరలు సగటున 55 డాలర్లకు తగ్గుతాయని చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ ధరలతో భారతీయ క్రూడ్ బాస్కెట్‌కు దగ్గరి రిలేషన్ ఉండటం, దేశీయంగా కూడా ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గిపోనున్నాయి.

Read Also: Indrakeeladri Dispute: ఇంద్రకీలాద్రిపై పవర్ పంచాయతీ.. సీఎంఓకు చేరిన వివాదం

అయితే, ప్రస్తుతం బ్యారెల్‌కు 62.20 డాలర్లుగా ఉన్న భారతీయ క్రూడ్ ఆయిల్ ధరలు, రాబోయే రోజుల్లో 53.31 డాలర్లకు తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. దీంతో మన దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంతో పాటు పెట్రోల్ బంకుల్లో సామాన్యులకు ఇంధన ధరల భారం తగ్గిపోనుంది. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి క్రూడ్ ఆయిల్ ధరల్లో 14 శాతం తగ్గుదల కనిపిస్తే, రిటైల్ ద్రవ్యోల్బణం (CPI) సుమారు 22 బేసిస్ పాయింట్ల మేర తగ్గిపోతుందని, ఫలితంగా 2027 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 3.4 శాతం దిగువకు చేరే ఛాన్స్ ఉందని ఎస్‌బీఐ రిపోర్టులో విశ్లేషించింది.

Read Also: Vaibhav Suryavanshi History: వైభవ్ సూర్యవంశీ నయా చరిత్ర.. రిషబ్ పంత్ రికార్డు బద్దలు!

మరోవైపు, వెనిజులా అధ్యక్షుడిని అమెరికా సైన్యం బంధించడాన్ని, చైనా సహా పలు దేశాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతాయన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫలితంగా సురక్షితమైన పెట్టుబడి సాధనాలుగా భావించే బంగారం, వెండి ధరలపైకి నిధులు తరలి వెళ్తు్న్నాయి. అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర 115 డాలర్లు, వెండి ధర 4 డాలర్లు పెరిగాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో మంగళవారం నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,40,800కు, కిలో వెండి ధర రూ.2,71,000కు చేరుకుంది.

Exit mobile version