T20 World Cup 2024 Final : వామ్మో..మ్యాచ్ రోజు జనాలు తెగ తినేశారు..తాగేశారు..
- కిక్కిరిసిన రెస్టారెంట్లు.. బార్లు
- 40% నుంచి 50% వరకు పెరిగిన విక్రయాలు..ఆదాయాలు
- ఆహారం పానీయాల కోసం భారీగా ఆర్డర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సాధించి విశ్వవిజేతగా మారింది. ఎట్టకేలకు భారత క్రికెట్ అభిమానుల కల నెరవేరింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి విజయతీరాలకు చేర్చారు. తాజాగా మ్యాచ్ రోజు జరిగిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జనాలు ఫుల్ గా తినడం, తాగడం చేశారు. దీంతో ఒక్కసారిగా హోటళ్లు, బార్ల గిరాకీ పెరిగింది. ఇష్టమైన ఆహార పదార్థాలు తింటూ ఫైనల్ మ్యాచ్‌ను ఆస్వాదించారు. కప్ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునేందుకు ప్రజలు ఆహారం & పానీయాల కోసం అమితంగా ఆర్డర్లు పెట్టారు. దీంతో రెస్టారెంట్లతో పాటు శీఘ్ర వాణిజ్య సంస్థల విక్రయాలు, ఆదాయాలు 40% నుంచి 50% వరకు పెరిగాయి. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. ముంబైలోని విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ రెస్టారెంట్ పూర్తిగా నిండిపోయింది. పూర్తి సామర్థ్యంతో అక్కడ బిజినెస్ జరిగింది. ది బీర్ కేఫ్ రెస్టారెంట్ ప్రారంభమై 12 సంవత్సరాలు గడిచాయి. గతంలో ఎన్నడూ లేనంత “సింగిల్ డే రెవెన్యూ”ను ఆ రెస్టారెంట్ చైన్ సాధించింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. దేశంలోని అన్ని పెద్ద నగరాల్లో బార్లు కేఫ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు నిండిపోయాయి. బిజినెస్ మహా జోరుగా సాగింది. కొందరు వ్యాపారులు చెప్పిన ప్రకారం… వాళ్ల వ్యాపార ప్రాంగణాల్లో అంత పెద్ద జన సమూహాన్ని చూడడం అదే తొలిసారి.
READ MORE: Sunaina : దుబాయ్ యూట్యూబర్ తో పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్.. బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..
Also Read
- Zepto: దలాల్ స్ట్రీట్‌లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
- Life Insurance Mistakes: లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ 5 తప్పులు చేయకండి!
- Nifty 50: రికవరీ దిశలో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 25,000 మార్క్‌ను దాటుతుందా..?
- Gold Coins-Gold Bars: గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్ కొంటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఫిన్‌టెక్ స్టార్టప్ ‘సింపుల్’ (Simpl) రిపోర్ట్ ప్రకారం.. క్రికెట్ వరల్డ్ కప్ T20 ఫైనల్ మ్యాచ్ సమయంలో ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదార్లు చేసిన ఖర్చు 40 శాతం పెరిగింది. యూజర్లు రెండో ఆలోచన లేకుండా వాలెట్లను తెగ వాడేశారు. గత వన్ డే ప్రపంచ కప్ ఫైనల్‌తో పోలిస్తే, T20 ప్రపంచ కప్ ఫైనల్లో క్విక్ కామర్స్‌లో కొనుగోళ్లు 40 శాతం పెరిగాయి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు, శనివారం రాత్రి 8 గంటల నుంచి 11 గంటల మధ్య, క్విక్ కామర్స్ ద్వారా ప్రజలు విరామం లేకుండా ఆర్డర్లు పెట్టారు. ఆ 3 గంటల పాటు ఆర్డర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. శనివారం, Simpl రిపోర్టు ప్రకారం.. ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 16,410 ఖర్చు చేశాడు. మరో వినియోగదారుడు ఏకంగా 59 ఆర్డర్లు చేశాడు. జెప్టో (Zepto), బ్లింకిట్ (Blinkit), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart), పోర్టర్ (Porter) సహా వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో Simpl ద్వారా రూ. 100 లోపు విలువైన ఆర్డర్లు తెరిపిలేకుండా వస్తూనే ఉన్నాయి. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఫైనల్‌తో పోలిస్తే ఈసారి ఆర్డర్లు 35% పెరిగాయి.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్‌లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?