Site icon NTV Telugu

Paytm: ఇక పేటీఎం వంతు.. యూజర్లకు భారీ షాక్..!

Paytm

Paytm

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి మొదట్లో ఎన్నో రాయితీలను, ఆఫర్లను తీసుకొచ్చిన ఆ ప్లాట్‌ఫారమ్‌లోని వివిధ సంస్థలు.. ఆ తర్వత వడ్డింపులు మొదలు పెట్టాయి.. మొబైల్‌ రీఛార్జ్‌తో పాటు ఇతర సేవలకు చార్జీలు వసూలు చేస్తున్నాయి.. తాజాగా, ఈ జాబితాలో పేటీఎం కూడా చేరింది.. తన ప్లాట్‌ఫారమ్ ద్వారా చేసే మొబైల్ రీఛార్జ్‌పై పన్నులు విధించడం మొదలుపెట్టింది. ఈ పన్ను ప్రస్తుతం రూ.1 నుండి రూ. 6 వరకు ఉంది. పన్ను మొత్తం రీఛార్జ్ ఖర్చులపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. యాప్ యొక్క యూపీఐ సేవ, పేటీఎం వాలెట్ లేదా బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్న వ్యక్తులు ప్రస్తుతం ఈ అదనపు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దీంతో, పేటీఎం యూజర్లకు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పినట్టు అయ్యింది.

Read Also: Rahul Gandhi: నేడు ఈడీ ముందుకు రాహుల్‌ గాంధీ..

పేటీఎం యాప్‌ ద్వారా మొబైల్‌ రీఛార్జ్‌ చేస్తే ఎంత అదనపు ఛార్జీలు వసూలు చేస్తుందనే దానిపై క్లారిటీ రాకపోయినా.. నివేదికల ప్రకారం మాత్రం రూ.1 నుంచి రూ.6 మధ్యలో అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. రూ.100కి మించిన ట్రాన్సాక్షన్‌లు చేస్తే వాటిపై సర్‌ ఛార్జీల మోత తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికే కొంతమంది వినియోగదారులకు మొబైల్ రీఛార్జ్‌ల కోసం అదనపు రుసుములను వసూలు చేయడం ప్రారంభించినట్టు సమాచారం. ఇది నెమ్మదిగా రాబోయే రోజుల్లో ప్రతి వినియోగదారుడిగా అమలు చేసే అవకాశం ఉంది. గాడ్జెట్స్ 360 నివేదిక ప్రకారం, కొంతమంది వినియోగదారుల నుంచి మార్చిలో ఈ అదనపు ఛార్జీలను చూశారు. ఈ-కామర్స్ కంపెనీ రూ.100 మరియు అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేసే వినియోగదారులపై పన్నులు విధించడం ప్రారంభించిందని పేర్కొంది.

Exit mobile version