NTV Telugu Site icon

Paytm : కొత్త వ్యాపారంలోకి పేటీఎం .. త్వరలోనే ఆ సర్వీస్ ప్రారంభం..

Paytm

Paytm

ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం కస్టమర్స్ ను పెంచుకొనేందుకు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పేమెంట్స్ ను చెల్లించడంలో కొత్త మార్గాలను తీసుకురావడంతో పాటుగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఎక్కువ వాడుతున్న పేమెంట్స్ యాప్ లలో ఈ యాప్ ముందుంటుంది. తాజాగా ఆర్బీఐ తీసుకొచ్చిన ఆంక్షల వల్ల కొంత నష్టాన్ని చూసిన మళ్లీ పుంజుకోవడం కోసం కొత్త సర్వీసులను తీసుకొస్తున్నారు..

ఈ సంస్థ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. తన ప్లాట్ ఫాంలోని ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ద్వారా ఆటో రిక్షా బుకింగ్ సేవలను ప్రారంభించనుంది. కేవలం మెట్రో నగరాల్లో మాత్రమే ఆ సర్వీసులను అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు సమాచారం. ఆ ప్రాంతాల్లో సక్సెస్ అయితే ఆ తర్వాత అన్ని నగరాల్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

ఈ యాప్‌లో బుక్ చేసిన ఆటో రిక్షాలు ఓఎన్డీసీ మద్దతు  ద్వారా నమ్మ యాత్రి యాప్ కు అనుసంధానం చేశారు. ఇది సంప్రదాయ కమీషన్ విధానానికి విరుద్ధంగా డ్రైవర్ భాగస్వాములకు చందా రుసుముతో తన సేవలను అందిస్తుంది.. ఏడూ నగరాల్లో సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. వీటిలో ఎక్కువ భాగం ఆటో రైడ్‌లు. నగరాల్లో క్యాబ్ బుకింగ్‌లను కూడా ప్రారంభిస్తోంది.. ఈ సర్వీస్ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..