సరికొత్త మొబైల్స్, ప్రొడక్ట్స్‌తో మరోసారి సిద్ధమైంది వన్ ప్లస్. దీనికి సంబంధించి వచ్చే నెలలో వన్‍ప్లస్ మెగా లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‍లో విడుదల చేసే ప్రొడక్టుల గురించి ఒక్కటిగా ఆ సంస్థ వెల్లడిస్తోంది. వన్‍ప్లస్ 11ఆర్ 5జీ మొబైల్‍ను కూడా అదే ఈవెంట్ ద్వారా ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్టు సంస్థ వెల్లడించింది. దీంతో ఫిబ్రవరి 7వ తేదీన జరిగే కార్యక్రమం ద్వారా వన్‍ప్లస్ 11ఆర్ 5జీ కూడా అడుగుపెట్టనుందని తెలిసిపోయింది. ఈ ఈవెంట్‍లో వన్‍ప్లస్ 11 5జీ ఫ్లాగ్‍షిప్ మొబైల్, వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, వన్‍ప్లస్ తొలి కీబోర్డు, వన్‍ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో స్మార్ట్ టీవీ, వన్‍ప్లస్ 11ఆర్ 5జీ విడుదల కానున్నాయి. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍లో ఈ ప్రొడక్టులు అందుబాటులోకి వస్తాయి.
వన్‍ప్లస్ 11ఆర్ 5జీ వివరాలు
వన్‍ప్లస్ 11ఆర్ 5జీకి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి. స్నాప్‍డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వస్తుందని తెలుస్తోంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‍డీ ప్లస్ అమోల్డ్ డిస్‍ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్13తో రావొచ్చు. వన్‍ప్లస్ 11ఆర్ 5జీ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సల్ + 12 మెగాపిక్సల్ + 2 మెగాపిక్సల్ కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను వన్‍ప్లస్ పొందుపరచనుంది. ఈ ఫోన్‍లో 5000mAh బ్యాటరీ ఉండనుండగా.. 100వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది.