Site icon NTV Telugu

Choker Necklace: అప్ప‌టి కాసుల‌పేరు.. ఈత‌రం అమ్మాయిల‌కు ఫేవ‌రేట్‌

Kasulaperu

Kasulaperu

అప్ప‌టిక‌ల.. ఇప్ప‌టి ట్రెడీష‌న్ గా మారుతోంది. అల‌నాటి అభర‌ణాల‌ను ఇప్ప‌టి యువ‌తులు ఆస‌క్తి చూపుతున్నారు. ఒక‌ప్ప‌టి ట్రెండ్ ను ఇప్పుడు ఆ యువ‌తులు ఫాలో అవుతున్నారు. తాతమ్మల కాలం నాటి కాసుల పేరు ఇక‌ప్పుడు ఓక్రేజ్‌. కాసుల పేరు ధ‌రించేవారు ఒక హుందాత‌నం వుంటుంది. కానీ కాసుల పేరు ధ‌రించేందుకు యువ‌తులు అంత‌గా ఆస‌క్తి చూప‌లేదు. కానీ ఇప్పుడు ఆ కాసుల పేరే మొడ‌కు హ‌త్తుకుని అతివ‌ల‌కు అందాన్ని మ‌రింత పెంచుతుండ‌టంతో.. కాసుల‌పేరుపై అతివ‌లు ఆస‌క్తి చూపుతున్నారు. ఈ త‌రం అమ్మాయిలకు అదే కాసుల‌పేరు నచ్చిన నగగా మారి చాలా రోజులే అయ్యింది. పెళ్లికూతుళ్ల మెడలోను, కాలేజీ అమ్మాయిల జువెలరీ బాక్స్‌లోనూ చేరిపోయింది. చిన్నా పెద్దా కాసులతో, రకరకాల రాళ్లను పొదిగిన కాసుల హారాలు మోడ్రన్‌ లుక్‌నూ సంపాదించుకున్నాయి. ఈనేప‌థ్యంలో.. ఇప్పుడు మరింత ట్రెండీగా.. కాసుల నగను చోకర్‌ లుక్‌లో తీసుకొస్తున్నారు ఆభరణాల డిజైనర్లు.

Read also: Contract Wedding: వైరల్‌గా మారిన కాంట్రాక్ట్‌ వెడ్డింగ్‌.. దిమ్మతిరిగే షరతులు..!

అతివ‌ల‌కు న‌చ్చే విధంగా ఫ్యాషనబుల్‌ చోకర్‌లో కొన్ని కాసులను చేర్చి.. అచ్చంగా కాసులతోనే చోకర్‌ను రూపొందించి, మన ముందుకు తెస్తున్నారు. అంతేకాదు రాళ్లు, ఎనామిల్‌లాంటి వాటిని జోడించి మరింత అందాన్ని ఆపాదిస్తున్నారు. కాసుల‌పేరులో లక్ష్మీ దేవితో పాటు వివిధ డిజైన్లు చెక్కిన కాసులు మగువల్ని కట్టిపడేసేలా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో పచ్చలు, కెంపులు, కుందన్లు, వజ్రాలతో పాటు రకరకాల రంగురాళ్లను పొదిగి ఇంకొంచెం ఆకర్షణను ఆపాదిస్తున్నారు. అయితే రియాలిటీకి ఉత్తిప‌డేలా సహజత్వం కోసం, అందులో మువ్వలు, ముత్యాలు కూడా వేలాడదీస్తున్నారు. ఈనాటి సంప్రదాయంగా కనిపిస్తూనే ట్రెండీగా అనిపించడం కాసుల చోకర్లకే సాధ్యం..! అంటూ మ‌గువ‌ల‌కు మొచ్చుకునేలా చేస్తున్నాయి.

Adipurush: ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించిన డైరెక్టర్.. కానీ!

Exit mobile version