NTV Telugu Site icon

November New Rules : నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్..

November

November

అక్టోబర్ నెల ఈరోజుతో ముగియనుంది.. రేపటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.. కొత్త నెల ప్రారంభంతో అనేక ఆర్థిక మార్పులు జరగబోతున్నాయి. ఇది సామాన్య ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.. చమురు కంపెనీలు ఎల్‌పీజీ ధరలను నిర్ణయిస్తాయి. ఈ పండుగ సీజన్‌లో సాధారణ ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపే మార్పులు ఏమిటో తెలుసుకుందాం..

సిలిండర్ ధర..

ప్రభుత్వ చమురు కంపెనీలు ఎల్‌పిజి, పిఎన్‌జి, సిఎన్‌జి ధరలను ప్రతి నెల మొదటి తేదీన నిర్ణయిస్తాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పండుగల ముందు ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇస్తుందో లేక ధరలు నిలకడగా ఉంచుతుందో చూడాలి…

ఎల్ఐసీ పాలసీ..

ఎల్‌ఐసీ పాలసీలు ఏవైనా ల్యాప్‌ అయ్యి, దాన్ని రీస్టార్ట్ చేయాలనుకుంటే మీకు అక్టోబర్ 31 వరకు అవకాశం ఉంది. ఆగి ఉన్న పాలసీని పునరుద్ధరించేందుకు ఎల్ఐసీ ప్రత్యేక ప్రచారాన్ని (ఎల్ఐసీ పాలసీ రివైవల్ క్యాంపెయిన్) ప్రారంభించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఈ ప్రత్యేక ప్రచారంలో రూ. 1 లక్ష ప్రీమియంపై ఆలస్య రుసుములో 30 శాతం తగ్గింపు అంటే గరిష్టంగా రూ. 3,000 ఇవ్వబడుతుంది. 1 లక్ష నుండి 3 లక్షల మధ్య, 30% తగ్గింపు లభిస్తుంది. అంటే గరిష్టంగా రూ. 3500, 3 లక్షల కంటే ఎక్కువ, 30% తగ్గింపు అంటే రూ. 4000 వరకు బెనిఫిట్‌ పొందవచ్చు.దానికి చివరి అవకాశం ఈరోజే.. ఈ పని త్వరగా పూర్తి చెయ్యండి..

ల్యాప్‌టాప్‌లు దిగుమతి..

ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. నవంబర్‌లో దీనికి సంబంధించి ఎలాంటి మార్పులు వస్తాయనే దానిపై రేపు స్పష్టత రానుంది..

ఇక చివరగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటే BSE అక్టోబర్ 20, 2023న ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో తన లావాదేవీల రుసుములను పెంచబోతున్నట్లు తెలియజేస్తూ పెద్ద ప్రకటన చేసింది. ఎస్‌అండ్‌పీ, బీఎస్‌ఈ సెన్సెక్స్ ఎంపికలపై ఈ ఛార్జీలు విధించబడతాయి..రిటైల్ వ్యాపారుల పై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని తెలుస్తుంది..