Site icon NTV Telugu

Microsoft: నో ‘శాలరీ హైక్’.. బోనస్ బడ్జెట్‌లోనూ కోత?!

Microsoft

Microsoft

Microsoft: మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగుల కష్టకాలం ఇంకా కొనసాగుతోంది. ఈ జనవరిలో మైక్రోసాఫ్ట్ ఏకంగా పది వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. ఆర్థిక మాంద్యం ముప్పుతో ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను ఇళ్లకు పంపిన మైక్రోసాఫ్ట్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పూర్తిస్థాయి ఉద్యోగుల జీతాలను పెంచబోమని తాజాగా స్పష్టం చేసింది. బోనస్, స్టాక్ అవార్డుల బడ్జెట్ ను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఉద్యోగులకు అంతర్గత ఈ-మెయిల్ పంపినట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్ ప్రతినిధి స్పందించడానికి ముందుకు రాలేదు.

Read also: Aishwarya dead body: హైదరాబాద్‌కు చేరిన తాటికొండ ఐశ్వర్య మృతదేహం..

కాగా.. గతేడాది మార్కెట్ పరిస్థితులు, కంపెనీ పనితీరు ప్రకారం పరిహారం చెల్లింపులో గణనీయంగా పెట్టుబడి పెట్టాము. మన గ్లోబల్ మెరిట్ బడ్జెట్ దాదాపు రెట్టింపు అయింది. ఈ ఏడాది ఆర్థిక పరిస్థితులు చాలా రకాలుగా విభిన్నంగా ఉన్నాయని సత్య నాదెళ్ల ఆ ఇమెయిల్‌లో చెప్పినట్లు సమాచారం. గత జనవరిలో, మైక్రోసాఫ్ట్ 10 వేలు మంది ఉద్యోగులను వారి ఇళ్లకు తరలించింది. ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు టెక్నాలజీ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రస్తుతం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాల‌జీపై మైక్రోసాఫ్ట్ పెట్టుబ‌డులు కొన‌సాగ‌నున్నాయి. దీర్ఘకాలిక విజయం కోసం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. సాంకేతిక రంగంలో పోటీ స్ఫూర్తి పెరుగుతోందని చెప్పారు. మైక్రోసాఫ్ట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆయన లేఖలో స్పష్టం చేశారు.
Dhoni chants: ఇదెక్కడి మాస్ ఫాలోయింగ్‌రా మావా.. చెపాక్ స్టేడియంలో ధోనీ క్రేజ్

Exit mobile version