No.of Airports in India After Modi: నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక.. దేశంలో ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య దాదాపు రెట్టింపయింది. ఆయన తొలిసారి 2014లో ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 140కి పెరిగాయి. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య ట్రిపుల్ కానుందని.. అంటే.. 220కి చేరనుందని అధికారులు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు గోవాలో మోపా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రారంభించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు.
కేంద్రంలో మోడీ హయాం ప్రారంభమయ్యాక దేశీయ, అంతర్జాతీయ వైమానిక రవాణా మార్గాలు, అనుసంధానాలు పెరిగాయని, పలు విమానాశ్రయాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని వెల్లడించారు. గత నెలలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో డోనీ పోలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టును లాంఛ్ చేశారు. జులైలో దియోఘర్ ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చారు.
reas also: Indian Workforce After Covid: కొవిడ్ తర్వాత కొలువుల సంఖ్య తగ్గినా.. పెరిగిన క్వాలిటీ జాబ్స్
గతేడాది నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని జెవార్ ప్రాంతంలో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు. గతేడాది అక్టోబర్‌లో ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రమైన ఖుషీనగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. లేటెస్ట్‌గా ఓపెన్ చేసిన మోపా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు నరేంద్ర మోడీయే 2016 నవంబర్‌లో శంకుస్థాపన చేశారు. ఇది గోవాలో 2వ విమానాశ్రయం కాగా దబోలిమ్ ప్రాంతంలో మొట్టమొదటిది మరియు ఎన్నో ప్రత్యేకతలు కలిగింది కావటం విశేషం.