Site icon NTV Telugu

Nita Ambani : అంబానీ గ్యారేజిలోకి మరో కారు.. ధర ఎంతో తెలుసా?

Nita Car

Nita Car

ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అత్యంత సంపన్నులలో ఒకరు.. ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఎక్కువగా లగ్జరీగా ఉంటుంది.. ఆమె వేసుకొనే డ్రెస్సుల నుంచి కాళ్లకు వేసుకునే చెప్పుల వరకు అన్ని ఖరీదైనవిగా ఉంటాయి. ఇటీవల తన్న చిన్నకొడుకు పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు.తన లుక్స్, ఫ్యాషన్‌తో అతిథులను సర్‌ప్రైజ్‌ చేశారు.. ఇప్పుడు మరో ఖరీదైన కారును కొనుగోలు చేశారు.. దీంతో అంబానీ గ్యారేజ్ లోకి మరో కొత్త కారు వచ్చి చేరింది..

ఆ కారు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. ప్రస్తుతం దీని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..కస్టమైజ్డ్ రోజ్ క్వార్ట్జ్ లగ్జరీ రోల్స్ రాయిస్ ఫాంటమ్ సెడాన్‌ను కొనుగోలు చేశారు. బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఫ్లాగ్‌షిప్ మోడల్ కారు ఇది.. ఇండియాలోనే మొట్టమొదటిదని భావిస్తున్నారు.. ఈ కారు స్పెషల్ గా ఉండటమే కాదు… ధర కూడా ఎక్కువగానే ఉంది.. ఈ కారు ధర పేరు విన్న వాళ్లంతా షాక్ అవుతున్నాయి..

ఈ ఖరీదైన కారు ధర రూ. 12 కోట్లకు పైనే ఉంటుంది.. ఇప్పటికే అంబానీ కుటుంబంలో ప్రపంచంలోనే ఖరీదైన కార్లు ఉన్నాయి.. ఇప్పటికే రోల్స్ రాయిస్ ఫాంటమ్స్,గోస్ట్స్, కల్లినన్స్సహా 168కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. అయినా కొత్త కలర్, అధునాతన ఫీచర్లతో ఉన్న కొత్త లగ్జరీ రోల్స్‌ రాయిస్‌ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది.. ఈ కారు సీట్ల పై పేర్లు కూడా డిజైన్ చేశారు.. ప్రస్తుతం ఈ కారు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Exit mobile version