Site icon NTV Telugu

గుడ్‌న్యూస్… తగ్గిన నెట్‌ఫ్లిక్స్ మెంబర్‌షిప్ ఛార్జీలు

కరోనా పుణ్యమా అని ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. సినిమా థియేటర్లు తెరిచినా ఓటీటీలు ఉన్నాయి కదా అని చాలా మంది వెళ్లడం లేదు. దీంతో పలు ఓటీటీ సంస్థలు ఛార్జీలు పెంచే పనిలో పడ్డాయి. తాజాగా అమెజాన్ సంస్థ ప్రైమ్ మెంబర్‌షిప్ ఛార్జీలు భారీగా పెంచింది. ఈరోజు అర్ధరాత్రి నుంచే పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఓటీటీ ప్రియులకు ఓ వైపు అమెజాన్ షాక్ ఇవ్వగా.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా మాత్రం గుడ్‌న్యూస్ చెప్పింది.

Read Also: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఈపీఎఫ్‌వో.. ఖాతాల్లో జమ

ఇప్పటివరకు ఉన్న నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్యాకేజీల ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం రూ.199గా ఉన్న బేసిక్ ప్లాన్‌ ధరలో రూ.50 తగ్గించింది. దీంతో ఈ ప్లాన్ ధర రూ.149కి చేరింది. ఇక ప్రీమియం ప్లాన్ ధర రూ.799గా ఉండగా.. రూ.649కే ఇవ్వనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. తగ్గించిన ప్లాన్ ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉండే కంటెంట్‌ను భారత్‌లో ఎక్కువమంది వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ప్లాన్ ధరలను తగ్గించామని చెప్పింది.

Exit mobile version