NTV Telugu Site icon

Mukesh Ambani: మళ్లీ అంబానీయే నంబర్‌ వన్‌.. అదానీ ఒక్కరోజుకే పరిమితం..!

ఏషియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించిన గౌతమ్‌ అదానీ ఆనందాన్ని ఒక్కరోజుకే పరిమితం చేశారు.. రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ.. 24 గంటల వ్యవధిలోనే అదానీని వెనక్కి నెట్టి.. మళ్లీ టాప్‌స్టాట్‌లోకి దూసుకొచ్చారు.. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ జాబితాలో ఏషియాలోనే నంబర్‌ ధనవంతుడిగా గౌతమ్‌ అదానీ అవతరించిన విషయం తెలిసిందే.. కాగా, 24 గంటలు తిరిగేసరికి ముకేష్‌ అంబానీ.. మళ్లీ నంబర్‌ వన్‌గా పేర్కొంది బ్లూంబర్గ్ బిలియనీర్స్‌ ఇండెక్స్‌.. దీని ఒకేరోజులో వారి సంపదలో తేడా రావడమే కారణం.. ఇక, అదానీ ఏషియా నంబర్‌ 2కి పరిమితం కాగా, ప్రపంచ ధనవంతుల్లో 11వ స్పాట్‌కు పడిపోయారు.

Read Also: KCR: వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసీఆర్‌ నాలుక కోస్తే కోటి రూపాయలు…!

కాగా, ఇవాళ బ్లూంబర్గ్‌ ఇండెక్స్‌ జాబితాలో రిలయన్స్‌ సంస్థల చీఫ్ ముకేష్‌ అంబానీ సంపద 89.2 బిలియన్‌ డాలర్లకు పైగా చేరింది.. నిన్న ఇది 87.9 బిలియన్‌ డాలర్లుకు పరిమితం అయిన విషయం తెలిసిందే.. మరోవైపు గౌతమ్‌ అదానీ సంపద తాజా జాబితా ప్రకారం 86.3 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. నిన్న 88.5 బిలియన్లుగా ఉంది.. అయితే, 24 గంటల వ్యవధిలో అంబానీ సంపద 1.33 బిలియన్‌ డాలర్లు పెరిగితే.. అదానీ సంపద మాత్రం ఏకంగా 2.16 బిలియన్‌ డాలర్లు తరిగిపోయింది.. దీంతో మళ్లీ లీడ్‌లోకి వచ్చిన ముకేష్ అంబానీ.. ఏషియా నంబర్‌ వన్‌ స్పాట్‌కు చేరడమే కాక.. ప్రపంచం కుబేరుల జాబితాలో టాప్‌ 10లో చోటు దక్కించుకుని.. 10వ స్థానంలో నిలిచారు.