NTV Telugu Site icon

Business: వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? ఇది చేయ్యండి తక్కువ పెట్టుబడి.. అధిక లాభాలు..!

Nets

Nets

మీరు స్వంత వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇవాళ్టి నుంచే ప్రారంభించండి. అయితే మీ దగ్గర పెట్టుబడి కంటే ముందు వ్యాపారం స్టార్ట్ చేయాలన్న సంకల్పం ఉండాలి.. మార్కెట్లో ఉండే పోటీ గురించి ఆలోచిస్తూ కాలం గడిపేయకుండా తక్కువ పెట్టుబడితో మార్కెట్లోకి అడుగుపెట్టాలి. వర్షా కాలంతో ఈ వ్యాపారం మీకు ఖచ్చితంగా సెట్ అవుతుంది. అలాగే, మీరు చాలా తక్కువ ఖర్చుతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను కూడా పొందవచ్చు.

Read Also: Balkampeta Ellamma Kalyanam: నేడే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు

సాధారణంగా సమ్మర్ లో కంటే వర్షాకాలంలో దోమలు ఎక్కువగా కుట్టడం మనం చూస్తుంటాం.. వీటికి చెక్ పెట్టేందుకు మనం పాత కాలం నుంచే దోమతెరలను ఉపయోగిస్తున్నాం.. మీరు ఈ వర్షాకాలంలో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే.. మీరు దాని నుంచి 7-8 నెలల్లో భారీ లాభాలను పొందుతారు. అంతేకాదు మంచం చుట్టు వేసుకునే దోమ తెరలు మాత్రమే మార్కెట్లో లభించేవి.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. విండోస్, ఎంట్రెన్స్ డోర్స్‌‌కు దోమ తెరలు కూడా వచ్చాయి. వీటికి మార్కెట్ లో డిమాండ్ ఉంది.

Read Also: Poornananda Swamy: బాలికపై లైంగిక వేధింపుల కేసులో పూర్ణానంద అరెస్ట్

దోమతెరల వ్యాపారం కోసం మీకు స్పెషల్ గా స్థలం అవసరం లేదు. ఇది కాకుండా, మీరు ఏదైనా రద్దీ ప్రదేశాలలో చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేసుకుంటే ఈ వ్యాపారానికి మంచి డిమాండ్ వస్తుంది. వ్యాపారం ప్రారంభించిన కొద్ది సమయంలోనే బిజీగా మారుతుంది. ఎందుకంటే ఇలాంటి వ్యాపారం చేసేవారి సంఖ్య ప్రస్థుతం మార్కెట్లో చాలా తక్కువగా కనబడుతుంది. ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసేందుకు కేవలం రూ.10వేలు సరిపోతాయి. ఈ మధ్య కాలంలో అనేక రకాల దోమతెరలు మార్కెట్ లోకి వస్తున్నాయి. ప్రజలు కోరుకున్నది కొత్త డిజైన్‌లతో కూడిన దోమతెరలను అమ్మితే ఫుల్ డిమాండ్ ఉంటుంది.

Read Also: Joe Root Stumped Out: ఔట్ అయి కూడా.. అరుదైన రికార్డు నెలకొల్పిన జో రూట్!

ఈ వ్యాపారంలో నష్టపోయే అవకాశం చాలా తక్కువ.. మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే.. దోమతెరలను సూర్యకిరణాలు-వర్షం నుంచి రక్షించుకుంటే చాలు.. మీరు మీ దుకాణంలో పిల్లల నుంచి డబుల్ బెడ్‌ల వరకు అన్ని రకాల దోమతెరలను ఉంచడం వల్ల మంచిగా వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మీరు దీన్ని రెట్టింపు లాభంతో అమ్ముకొవచ్చు. అంటే రూ.100 పెట్టి దోమతెర కొనుగోలు చేస్తే రూ.200 లేదా రూ.300కి ఈజీగా అమ్మవచ్చు.. అంటే మీరు ఈ వ్యాపారం నుండి పెద్ద ఎత్తున సంపాదించించవచ్చు..

Show comments