Site icon NTV Telugu

Most Valuable Company: అత్యంత విలువైన కంపెనీగా యాపిల్‌ని అధిగమించిన మైక్రోసాఫ్ట్..

Most Valuable Company

Most Valuable Company

Most Valuable Company: ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. యాపిల్‌ని అధిగమించి ఈ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి యాపిల్ డిమాండ్ ఆందోళనల్ని ఎదుర్కొంటోంది. గురువారం యాపిల్‌ని అధిగమించి అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. మైక్రోసాఫ్ట్ షేర్లు 1.5 శాతం పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మైక్రోసాఫ్ట్ ఆధిక్యత 2.888 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సహాయపడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం మైక్రోసాఫ్ట్ వృద్ధికి మరింతగా కారణమవుతోంది.

యాపిల్ 2.871 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో 0.9 శాతం తక్కువగా ఉంది. 2021 తర్వాత తొలిసారిగా యాపిల్ వాల్యుమేషన్ మైక్రోసాఫ్ట్ కంటే తక్కువగా పడిపోయింది. మైక్రోసాఫ్ట్‌లో 1.8 శాతం పెరుగుదలతో పోలిస్తే, కాలిఫోర్నియాకు చెందిన క్యూపర్టినో కంపెనీ స్టాక్ జనవరిలో చివరి ముగింపు నాటికి 3.3 శాతం పడిపోయింది. మైక్రోసాఫ్ట్ 2018 నుంచి కొన్నిసార్లు యాపిల్ కన్నా అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. 2021లో కోవిడ్ సమయంలో సప్లై చైన్ ఆందోళన నేపథ్యంలో యాపిల్‌ని అధిగమించింది.

Read Also: Vande Bharat: వందేభారత్ ఆహారంలో దుర్వాసన.. ప్రయాణికుడి పోస్టుకు స్పందించిన రైల్వేశాఖ..

యాపిల్ అమ్మకాలు ముఖ్యంగా కంపెనీకి ఎక్కువగా డబ్బు సంపాదించే ఐఫోన్ల అమ్మకాలు బలహీనంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన మార్కెటైన చైనాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాబోయ ఏళ్లలో చైనా పనితీరు మరింత దిగజారొచ్చని బ్రోకరేజ్ రెడ్‌బర్న్ అట్లాంటిక్ బుధవారం పేర్కొంది. హువావే నుంచి కాంపిటిషన్, చైనా-యూఎస్ మధ్య ఉద్రిక్తతలు యాపిల్‌పై ఒత్తిడిని పెంచుతోంది.

డిసెంబర్ 14న మార్కెట్ క్యాపిటలైజేషన్ 3.081 ట్రిలియన్ డాలర్లకు యాపిల్ షేర్లు చేరాయి. గతేడాది 48 శాతంతో ముగిశాయి. ఇది మైక్రోసాఫ్ట్ 57 శాతం కన్నా తక్కువ. మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీ మేకర్ ఓపెన్ఏఐతో టై ఆప్ కావడంతో దూసుకుపోతోంది.

Exit mobile version