Site icon NTV Telugu

Maruti EV: భార‌త మార్కెట్లోకి మారుతి సుజుకీ ఎల‌క్ట్రిక్ కారు… ధ‌ర ఎంతంటే…

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న‌ది. చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరుగుతుండ‌టంతో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం పెరిగింది. టాటా నిక్సాన్‌, ఎంజీ మోటార్స్‌తో పాటు మ‌రికొన్ని కంపెనీలు ఎల‌క్ట్రిక్ కార్ల‌ను త‌యారు చేస్తున్నాయి. భార‌త్‌లో అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒక‌టైన మారుతి-సుజుకీ సంస్థ ఎల‌క్ట్రిక్ కారును త‌యారు చేసింది. ఈ కారును విదేశాల‌కు ఎగుమ‌తి చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ది. దానికి త‌గ్గ‌ట్టుగానే మారుతీ సంస్థ కారును డిజైన్ చేసింది. ట‌యోటాతో క‌లిసి మారుతీ సుజుకీ సంస్థ ఈ కారును డిజైన్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియా మార్కెట్లో వ‌చ్చిన ఎల‌క్ట్రిక్ కార్ల కంటే శ‌క్తివంత‌మైన కారుగా మారుతీ సుజుకీ ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని కంపెనీ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

Read: Whatsapp: వాట్సాప్‌లో మ‌రో ఫీచ‌ర్‌…ఫేస్‌బుక్ త‌ర‌హాలో…

48 కేడ‌బ్ల్యూహెచ్ బ్యాట‌రీతో న‌డిచే ఈ కారును ఒక‌సారి చార్జ్ చేస్తే 400 కిమీ వ‌ర‌కు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. అదేవిధంగా 59 కెడ‌బ్ల్యూ బ్యాట‌రీతో న‌డిచే కారును చార్జ్ చేస్తే 500 కిమీ వ‌ర‌కు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. గుజ‌రాత్‌లోని డీడీఎస్జీ లిథియం అయాన్ బ్యాట‌రీల‌ను త‌యారు చేస్తున్న‌ది. వీటిని ఈ కారులో వినియోగిస్తున్నారు. ఇక ఈ కారు ధ‌ర రూ. 13 నుంచి 15 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటుంద‌ని కంపెనీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version