దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల పరిస్థితులు కారణంగా గత వారం సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. అయితే ఈ వారం ఆసియా మార్కెట్‌లోని అనుకూల సంకేతాలు మన మార్కెట్‌కు కలిసొచ్చింది. దీంతో సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా భారీ లాభాల దిశగా దూసుకెళ్లింది. ముగింపులో సెన్సెక్స్ 602 పాయింట్లు లాభపడి 80, 005 దగ్గర ముగియగా.. నిఫ్టీ 158 పాయింట్లు లాభపడి 24, 339 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 84.07 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తర్వాతి టార్గెట్ పప్పు యాదవ్..
ఇక నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్ లాభపడగా.. కోల్ ఇండియా, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్ నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3 శాతం, మెటల్ ఇండెక్స్ 2 శాతం, ఫార్మా, మీడియా, రియాల్టీ 1 శాతం చొప్పున పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం లాభపడ్డాయి.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: తమిళనాడులో విజయ్ పార్టీ ఏర్పాటు ..డిప్యుటీ సిఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్