New Rules in July: జులైలో కొత్త రూల్స్.. అమల్లోకి వచ్చేవి ఇవే..
- జులైలో మారనున్న క్రెడిట్ కార్డ్ రూల్స్.. రూల్స్ మార్చబోతున్న ఎస్బీఐ.. హెచ్డీఎఫ్సీ.. సిటీ బ్యాంక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Rules in July: ప్రతీ నెల కొత్త కొత్త రూల్ వస్తూనే ఉన్నాయి.. వాటిలో బ్యాంకులకు లింక్ ఉన్నవి కచ్చితంగా ఉంటున్నాయి.. ఇక, రేపటితో జూన్ నెల ముగియనుండగా.. సోమవారం నుంచి జులై నెల ప్రారంభం కాబోతోంది.. ఇదే సమయంలో.. కూడా కొన్ని కొత్త రూల్స్ రాబోతున్నాయి.. ముఖ్యంగా.. పెద్ద బ్యాంకుల ప్రధాన క్రెడిట్ కార్డ్ నియమ, నిబంధనలు మారబోతున్నాయి.. వాటిలో, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, సిటీ బ్యాంక్‌లకు సంబంధించిన కార్డులు ఉన్నరాయి.. ఇలా అనేక పెద్ద బ్యాంకులు కస్టమర్లకు అందించే తమ క్రెడిట్ కార్డ్ సేవలలో పెద్ద మార్పులు చేశాయి. మార్పులలో క్రెడిట్ రివార్డ్ పాయింట్లు, నిలిపివేయబడే ఛార్జీలు, రివార్డ్ పాయింట్ ప్రయోజనాలు, కార్డ్‌ల విలువ తగ్గింపు లాంటివి ఏపకపాచిజజ
ఇక, జులైలో అమల్లోకి వచ్చే పెద్ద బ్యాంకుల ముఖ్యమైన క్రెడిట్ కార్డ్ సంబంధిత మార్పులను పరిశీలిస్తే.. ఎబ్బీఐ క్రెడిట్ కార్డ్ 2024 జులై 1 నుండి నిర్దిష్ట క్రెడిట్ కార్డ్‌లకు ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. జులై 15 నుండి అమలులోకి వచ్చే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు వర్తించవని ఎబ్బీఐ క్రెడిట్ వెబ్సైట్ లో పేర్కొంది.. అంటే.. వచ్చే నెల 15 నుండి ప్రభుత్వ లావాదేవీలకు 22 రకాల క్రెడిట్ కార్డ్‌లపై రివార్డ్ పాయింట్లు వర్తించవు అన్నమాట..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
మరోవైపు.. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ విషయానికి వస్తే.. జులై 1వ తేదీ నుండి వివిధ క్రెడిట్ కార్డ్ సేవల్లో మార్పులు చేయబోతోంది.. అన్ని కార్డ్‌లపై (ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డ్ మినహా) కార్డ్ రీప్లేస్మెంట్ రుసుము రూ. 100 నుండి రూ. 200 వరకు పెంచబోతోంది.. ఇక, కొన్ని ఛార్జీలను నిలిపివేస్తోంది.. 1. చెక్ / క్యాష్ పికప్ ఫీజు
ఒక్కో పికప్‌కు రూ. 100 రుసుము నిలిపివేయబడుతుంది. 2. ఛార్జ్ స్లిప్ అభ్యర్థనలో ఛార్జ్ స్లిప్‌కు రూ. 100 రుసుము నిలిపివేయబడుతుంది. 3. డయల్-ఎ-డ్రాఫ్ట్ – లావాదేవీ రుసుములో కనిష్ట ధర రూ. 300తో డ్రాఫ్ట్ విలువ మొత్తంలో 3 శాతం తగ్గింపును ఎత్తివేయనుంది.. 4. అవుట్‌స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజులో చెక్కు విలువలో 1 శాతం, కనీసం రూ. 100కి లోబడి రద్దుచేయనుంది.. 5. డూప్లికేట్ స్టేట్మెంట్ అభ్యర్థన (3 నెలలకు మించి) విషయానికి వస్తే.. డూప్లికేట్ స్టేట్మెంట్ కోసం రూ. 100 రుసుము నిలిపివేయనున్నట్టు వెల్లడించింది. మొత్తంగా ఐసీఐసీఐ బ్యాంకు రూల్స్‌తో కొంతమేర వినియోగదారులకు లబ్ధిచేకూరనుంది.
అయితే, జూలై 15, 2024 నాటికి కార్డ్‌తో సహా అన్ని సంబంధాల మైగ్రేషన్ పూర్తవుతుందని సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు యాక్సిస్ బ్యాంక్ ఈమెయిల్ నోటిఫికేషన్ పంపింది. అలాగే సిటీ-బ్రాండెడ్ కార్డ్ వినియోగదారులు.. తమ కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లను స్వీకరించే వరకు సజావుగా ఆ పాత కార్డులు పని చేస్తూనే ఉంటాయని పేర్కొంది.. మైగ్రేషన్ తేదీ వరకు సేకరించిన పాయింట్లు ఎప్పటికీ గడువు తీరకుండానే ఉంటాయి. అయితే, మైగ్రేషన్ తర్వాత సంపాదించిన పాయింట్ల గడువు మూడేళ్ల తర్వాత ముగుస్తుంది. కాగా, యాక్సిస్ బ్యాంక్-సిటీ బ్యాంక్ కార్డ్ మైగ్రేషన్‌లో భాగంగా.. 9 రకాల కార్డులు యాక్సిస్ బ్యాంక్‌కు బదిలీ చేయబడ్డాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నియమాల విషయానికి వస్తే.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ క్రెడ్, పేటీఎం, చెక్, మొబిక్విక్, ఫ్రీఛార్జ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా క్రెడిట్ కార్డ్ అద్దె చెల్లింపుల కోసం కొత్త రేట్లను అమలు చేసింది. ప్రతి లావాదేవీకి రూ. 3,000 సీలింగ్‌తో అద్దె లావాదేవీలపై వినియోగదారులకు 1 శాతం రుసుము విధించబడుతుంది. ఇది ఈ ఏడాది ఆగస్టు 1 నుండి అమలులోకి రాబోతోంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!