NTV Telugu Site icon

Mahindra: గుడ్‌న్యూస్… ఆ మోడ‌ళ్ల‌పై భారీ డిస్కౌంట్‌…

దేశంలో ప్ర‌ముఖ ఆటోమొబైల్ సంస్థ ఆనంద్ మ‌హీంద్రా ప‌లు సెలెక్టెడ్ మోడ‌ళ్ల‌పై భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు సిద్ద‌మ‌యింది. మ‌హీంద్రా సంస్థ ఎంపిక చేసిన మోడ‌ళ్ల‌పై రూ. 80 వేల కంటే ఎక్కువ రాయితీలను అందించ‌బోతున్న‌ది. ఈ ఆఫ‌ర్ కేవ‌లం ఫిబ్ర‌వరి నెల‌లో వాహ‌నాల‌ను కొనుగోలు చేసేవారికి మాత్ర‌మే వ‌ర్తిస్తున్న‌ది. మ‌హీంద్రా ఆల్ట్రాస్ జీ4 ఎస్‌యూవీ పై దాదాపు రూ. 81,500 వర‌కు ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. మ‌హీంద్రా ఆల్ట్‌రాస్ జీ4 ఎక్స్చేంజ్ బోన‌స్‌తో దాదాపు రూ. 50 వేలు త‌గ్గింపు, దీంతో పాటు అద‌నంగా రూ. 31,500 వ‌ర‌కు బినిఫిట్స్ పొందే అవ‌కాశం ఉన్న‌ది. ఇక ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 300 మోడల్‌లో దాదాపు రూ. 69 వేల ప్ర‌యోజ‌నాలు అంద‌నున్నాయి. అయితే, ఎక్స్‌యూవీ 700, థార్‌, బొలెరో నియో ఎస్‌యూవీ వంటి మోడ‌ల్స్‌కు ఈ రాయితీలు వ‌ర్తించ‌వు. దేశంలో వినియోగ‌దారులకు అందుబాటులో ఉండేలా వాహ‌నాల‌ను త‌యారు చేస్తున్న సంస్థ‌గా మ‌హీంద్రాకు గుర్తింపు ఉన్న‌ది. సామాన్యుల‌కు అందుబాటులో ఉండేలాగా, రైతుల కోసం, ల‌గ్జ‌రీ కోసం వివిధ ర‌కాల వాహ‌నాల‌ను త‌యారు చేస్తున్న‌ది మ‌హీంద్రా కంపెనీ.

Read: War Effect: కుప్ప‌కూలిన స్టాక్ మార్కెట్లు… రూ. 8.5 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి…