Site icon NTV Telugu

Ajit Pawar Net Worth: అజిత్ పవార్ ఆస్తుల విలువ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

Ajit Pawar Assets

Ajit Pawar Assets

Ajit Pawar Net Worth: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. 66 ఏళ్లు వయసులో ఆయన ప్రయాణిస్తున్న విమానం మహారాష్ట్రలోని బారామతి సమీపంలో కూలిపోయింది. ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన అజిత్ పవార్, మహారాష్ట్రలోని అత్యంత ధనిక రాజకీయ నాయకులలో ఒకరిగా ఉన్నారు. ఆయన నికర విలువ (అజిత్ పవార్ నెట్‌వర్త్) పలు నివేదికల ప్రకారం.. రూ.124 కోట్ల (సుమారు $1.24 బిలియన్).

READ ALSO: AP Cabinet Key Decisions: వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ కేబినెట్..

మహారాష్ట్రలో అత్యంత ధనవంతులైన నాయకులలో ఒకరు..
ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానంలో బుధవారం ఉదయం మహారాష్ట్రలోని బారామతిలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవర్ అత్యధిక సార్లు పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు. 2024 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఎన్నికల సంఘం ముందు అఫిడవిట్‌లో తన ఆస్తులను వెల్లడించారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఉటంకిస్తూ పలు నివేదికలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. అజిత్ పవార్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆయన నికర ఆస్తుల విలువ దాదాపు రూ.124 కోట్లు అని సమాచారం.

ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో పంచుకున్న సమాచారాన్ని పరిశీలిస్తే.. ఆయన కుటుంబం వద్ద మొత్తం రూ.14.12 లక్షల నగదు ఉండగా, వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ. 6.81 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. అజిత్ పవార్ బ్యాంకు డిపాజిట్లు మాత్రమే దాదాపు రూ.3 కోట్లు, ఆయన భార్య సునేత్రా పవార్ ఖాతాల్లో కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఉంది. దీనితో పాటు ఆయన NSS, పోస్టల్ సేవింగ్స్ ఖాతాలలో రూ.1.52 కోట్లు జమ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయన పేరు మీద, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద LIC లేదా ఇతర బీమా పాలసీ ఏమి లేదు. అజిత్ పవార్ షేర్లు, బాండ్లు, డిబెంచర్లలో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారు. ఆయన షేర్ మార్కెట్‌లో రూ.24 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆయన భార్య, పిల్లలు కూడా దాదాపు రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టారు. దీనితో పాటు అజిత్ పవార్ రూ.38 లక్షల విలువైన బంగారు-వెండి ఆభరణాలను కలిగి ఉన్నట్లు అఫిడవిట్‌లో ప్రకటించగా, ఆయన భార్య వద్ద రూ.1.19 కోట్లకు పైగా విలువైన బంగారు-వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. వీటితో పాటు ఆయన వద్ద దాదాపు రూ.80 లక్షల విలువైన వాహనాలు కూడా ఉన్నాయి.

కోట్ల విలువైన స్థిరాస్తి..
అజిత్ పవార్ స్థిరాస్తుల విషయానికొస్తే.. ఆయన తన కుటుంబానికి కోట్ల విలువైన ఆస్తిని వదిలి వెళ్ళారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయన, ఆయన భార్య సుమారు రూ.13.21 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని కలిగి ఉన్నారు. ఆయనకు రూ.37 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి కూడా ఉంది. అలాగే ఆయనకు రూ.11 కోట్లకు పైగా విలువైన వాణిజ్య భవనంతో సహా వాణిజ్య ఆస్తి కూడా ఉంది. వీటితో పాటు ఆయన పేరు మీద ఉన్న ఇళ్ల విలువ ఒక్కటి రూ.3 కోట్లు, ఇంకొక్కటి రూ.2 కోట్లు, మరొకటి దాదాపు రూ.90 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆయన భార్య సునేత్రా పవార్ కూడా రూ.22 కోట్లకు పైగా విలువైన నాలుగు ఇళ్లు, ఫ్లాట్‌లను కలిగి ఉన్నారు.

READ ALSO: Stock Market: దళాల్ స్ట్రీట్‌లో బుల్ గర్జన.. స్టాక్ మార్కెట్‌లో లాభాల జాతర!

Exit mobile version