LPG Cylinder: వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్రం శుభవార్త.. ఇక కష్టాలు తప్పినట్లే…

  • వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..
  • బుక్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ..
  • గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవన్న కేంద్రం..
Cylindersssss

Cylindersssss

గత కొద్ది రోజులుగా వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడటమే కాకుండా.. పంపిణీ ఆలస్యమవుతుండటంతో  జనాల్లో ఆందోళన మొదలైంది. అంతర్జాతీయంగా చమురు సరఫరా మార్గాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయన్న వార్తలతో.. అసలు గ్యాస్ దొరుకుతుందా లేదా అన్న భయం జనాలకు గురిచేసింది. చాలా మంది ముందు జాగ్రత్తగా బుకింగ్‌లు చేసుకుంటూ గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యుల భయాందోళనలను పటాపంచలు చేస్తూ ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది.

Also Read:Sanju Samson: టీ20 వరల్డ్‌కప్‌లో కెప్టెన్‌ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్‌..! ఆ సీక్రెట్‌ను లీక్‌ చేసిన సూర్య..

ప్రస్తుతం నెలకొన్న కొరత తాత్కాలికమేనని, గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా  భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు కేంద్రం పేర్కొంది. కేవలం రెండున్నర రోజుల వ్యవధిలోనే సిలిండర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల ప్రజలు గంటల తరబడి ఏజెన్సీల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఎల్పీజీ (LPG) ఉత్పత్తిని ఏకంగా 25 శాతం పెంచినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటించింది. అంటే గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.

Also Read:Bank Minimum Balance: మినిమం బ్యాలెన్స్ లేదని రూ.19 వేల కోట్లు వసూలు.. లబోదిబోమంటున్న ఖాతాదారులు..

దీనికి తోడు.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు దిగుమతులను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. హార్మూజ్ జలసంధి గుండా సరఫరా నిలిచిపోయినా.. ఆ రూట్‌తో సంబంధం లేని ఇతర మార్గాల ద్వారా అంతకుమించి చమురును సేకరిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. భారత్‌కు అవసరమైన గ్యాస్ నిల్వలను సమకూర్చడానికి త్వరలోనే రెండు భారీ ఎల్ఎన్జీ కార్గోలు దేశానికి చేరనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో పరిశ్రమలకు, గృహ అవసరాలకు సరిపడా గ్యాస్ అందుబాటులోకి రానుంది.  అంతే కాకుండా.. కృత్రిమ కొరత సృష్టించే వారిపై నిఘా ఉంచామని అధికారులు తెలిపారు. సామాన్యుల ఆవేదనను గుర్తించిన కేంద్రం, యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టడం నిజంగా గ్రేట్ రిలీఫ్ అనే చెప్పాలి.