NTV Telugu Site icon

LPG Cylinder Price: గుడ్‌న్యూస్‌.. రూ.91.5 తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

Gas

Gas

వరుసగా పెరిగిపోయి సామాన్యులకు భారంగా మారిన గ్యాస్‌ ధరల.. ఈ మధ్య తగ్గుముఖం పట్టాయి.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పతనం కావడంతో.. భారత్‌లో వాటి ప్రభావం కనిపిస్తోంది.. దేశీయ చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన ధరల ప్రకారం.. నేటి నుంచి 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటును రూ.91.5 తగ్గించాయి. సెప్టెంబర్ 1న ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన ధరల ప్రకారం.. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటును రూ.91.5 తగ్గించినట్టు పేర్కొంది.. ఇవాళ్టి నుంచే ఆ ధరలు అమల్లోకి రానున్నాయి..

Read Also: Marriage: నాలుగు పెళ్లిళ్లు.. ఏడుగురు పిల్లలు.. ఐదో పెళ్లిలో ట్విస్ట్‌..!

ఇది వినియోగదారులకు పెద్ద ఉపశమనంగా చెప్పుకోవాలి.. ప్రకటన ప్రకారం, 19 కిలోల కమర్షియల్ ఇండన్ గ్యాస్ సిలిండర్ పాత ధర రూ. 1976 07గా ఉండగా.. ఇప్పుడు రూ. 1885 అవుతుంది. అదేవిధంగా, కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 2095.50 నుంచి రూ. 1995.50కి తగ్గుతుంది.. కోల్‌కతాలో రూ. 1936.50 నుంచి రూ.1844కి.. ముంబైలో, మరియు చెన్నైలో రూ. 2141కి బదులుగా రూ. 2045 వసూలు చేస్తారు.. ఈ ధర తగ్గింపుతో రెస్టారెంట్లు, తినుబండారాలు మరియు టీ స్టాల్స్ మొదలైన వాటికి ఉపశమనం కలగనుంది.. కమర్షియల్‌ సిలిండర్ల వినియోగంలో.. 19 కిలోల సిలిండర్‌లో అతిపెద్ద వినియోగదారుగా ఉంది.. అయితే, దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. కమర్షియల్‌ సిలిండర్‌ ధర తగ్గిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లను పరిశీలించినట్లయితే.. హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ.2099.5కి చేరింది. వరంగల్‌లో 2141.50.గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో రూ.2034, విశాఖపట్నంలో రూ.1953కి చేరింది.

Show comments