Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Ideas: స్వంతంగా వ్యాపారం చేయాలనే ఆశ చాలామందికి ఉంటుంది.. కానీ చేతిలో పెట్టుబడి లేక, పెద్ద దుకాణాలు పెట్టే స్థోమత లేక ఆ కలను మధ్యలోనే వదిలేస్తుంటారు. అయితే ఇకపై అలాంటి నిరాశ అక్కర్లేదు. వ్యాపారానికి కావలసింది భారీ పెట్టుబడులు మాత్రమే కాదు.. పక్కా ప్రణాళిక, ఆలోచన మాత్రమేనని మార్కెట్ నిపుణులు తేల్చి చెబుతున్నారు. చేతిలో ఒక స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి, జేబులో కేవలం రూ.1,000 ఉంటే చాలు.. ఇంట్లోనే కూర్చుని నెలకు వేల నుంచి లక్షల రూపాయల వరకు సంపాదించే అద్భుతమైన వ్యాపార అవకాశాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
వెయ్యి రూపాయలతో మొదలయ్యే బెస్ట్ హోమ్ బిజినెస్ ఐడియాలు:
హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ: అతి తక్కువ ముడిసరుకుతో అందమైన కంకణాలు, ట్రెండీ ఆభరణాలు తయారుచేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా విక్రయిస్తే యువత నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తుంది.
Also Read
- India Unemployment Rate 2026: దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం.. 5.1 శాతానికి పడిపోయిన నిరుద్యోగ రేటు!
- EPS Pension Hike: EPS పెన్షనర్లకు గుడ్ న్యూస్.. రూ.3,000 కనీస పెన్షన్‌పై నవంబర్ 19న కీలక నిర్ణయం..!
- Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
- BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
హోమ్మేడ్ స్నాక్స్ & పాప్‌కార్న్: ఇంట్లోనే శుచీశుభ్రతతో తయారుచేసిన మథ్రి, పాపడ్, నమ్కీన్ లేదా ప్యాక్ చేసిన పాప్‌కార్న్ ప్యాకెట్లను స్థానిక మార్కెట్లు, చిన్న దుకాణాలలో విక్రయించడం ద్వారా మంచి లాభాలు ఆర్జించవచ్చు.
డిజిటల్ విజిటింగ్ కార్డులు, ఆహ్వాన పత్రాలు: నేటి డిజిటల్ యుగంలో పెళ్లిళ్లు, పుట్టినరోజులు, చిన్న వ్యాపారాల కోసం ప్రతి ఒక్కరూ డిజిటల్ ఇన్విటేషన్లు, విజిటింగ్ కార్డులనే కోరుకుంటున్నారు. కాన్వా (Canva) వంటి ఉచిత టూల్స్ ఉపయోగించి మొబైల్లోనే వీటిని డిజైన్ చేసి, స్థానిక వ్యాపారులకు విక్రయించడం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా లాభం పొందవచ్చు.
పూజా వత్తుల తయారీ: అతి తక్కువ ఖర్చుతో దూది కొనుగోలు చేసి, ఇంట్లోనే దూది వత్తులు తయారుచేసి సమీపంలోని ఆలయాలకు, కిరాణా షాపులకు నిరంతరం సరఫరా చేయవచ్చు. వీటికి మార్కెట్లో నిత్యం డిమాండ్ ఉంటుంది.
జీరో ఇన్వెస్ట్మెంట్ రీసెల్లింగ్: మీషో లేదా ఇతర రీసెల్లింగ్ ప్లాట్‌ఫామ్‌లలోని ఉత్పత్తులను వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సరుకును స్టాక్ పెట్టే రిస్క్ లేకుండానే ప్రతినెలా కమీషన్ రూపంలో వేలకు వేలు సంపాదించవచ్చు.
కంటెంట్ & స్క్రిప్ట్ రైటింగ్: రచనపై ఆసక్తి ఉంటే యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్సైట్లు, బ్లాగులకు కంటెంట్ లేదా స్క్రిప్ట్‌లు రాసిస్తూ ఫ్రీలాన్సర్‌గా ఇంటి నుంచే భారీ ఆదాయం అందుకోవచ్చు.
వ్యాపారాన్ని వేగంగా విస్తరించే గోల్డెన్ టిప్స్:
తొలి దశలో ఆర్డర్ ఖరారైన తర్వాతే సరుకును సిద్ధం చేస్తే ఎలాంటి నష్టం రాకుండా ఉంటుంది. మార్కెటింగ్ కోసం రూపాయి ఖర్చు లేకుండా వాట్సాప్ బిజినెస్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ప్రారంభంలో వచ్చిన లాభాలను సొంత ఖర్చులకు వాడకుండా, తిరిగి వ్యాపారంలోనే రీ-ఇన్వెస్ట్ చేస్తూ పోతే అతి తక్కువ కాలంలోనే మీ చిన్న ప్రయత్నం పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా ఎదుగుతుంది.
తాజావార్తలు
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
RGV Review: “నేనొక నాస్తికుడిని.. కానీ సినిమా ప్రేమికుడిగా చెబుతున్నా”.. రామాయణంపై ఆర్జీవీ సెకండ్ రివ్యూ..!
-
ICICI Bank Loan Fraud: ICICI బ్యాంకుకు టోకరా.. ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా రూ.30 లక్షల లోన్!
-
Yogi Adityanath: దీపావళి కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన అవసరం లేదన్న సీఎం
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
ట్రెండింగ్
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!