Site icon NTV Telugu

Local Languages in PSBs: లోకల్‌ లాంగ్వేజ్‌లు మాట్లాడలేనివారిని పక్కన పెట్టండి. నిర్మలా సీతారామన్‌ సూచన

Local Languages In Public Sector Banks

Local Languages In Public Sector Banks

Local Languages in Public Sector Banks: బ్యాంక్‌ ఉద్యోగులు స్థానిక భాషలను ఎందుకు నేర్చుకోలేకపోతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. లోకల్‌ లాంగ్వేజ్‌ల్లో మాట్లాడలేని సిబ్బందిని కస్టమర్‌ ఫేసింగ్‌ జాబుల్లో కూర్చోబెట్టొద్దని సూచించారు. స్థానిక భాషల్లో మాట్లాడగలిగే మరింత మందిని నియమించుకోవాలని బ్యాంక్ రిక్రూటర్లకు సలహా ఇచ్చారు. సౌతిండియాలోని పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల ఉద్యోగులు ప్రజలను హిందీలో మాట్లాడాలని అడుగుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బ్యాంకు ఉద్యోగాలను ఎక్కువగా నార్తిండియన్లు సెలెక్ట్ చేసుకుంటూ ఉండటం, సౌతిండియన్ యంగ్ గ్రాడ్యుయేట్లు అధికంగా ఐటీ సెక్టార్ వైపు మొగ్గుచూపుతుండటం వల్లే ఈ సమస్య తలెత్తుతున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.

23 ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ మిషన్‌ కింద తాజాగా 23 వ్యూహాత్మక పరిశోధక ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. స్పెషాల్టీ ఫైబర్స్‌, సస్టెయినబుల్‌ టెక్స్‌టైల్స్‌, జియోటెక్స్‌టైల్స్‌, మొబిల్‌టెక్‌ మరియు స్పోర్ట్స్‌ టెక్స్‌టైల్స్‌కి సంబంధించిన ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ దాదాపు 60 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టుల్లో అగ్రికల్చర్‌, స్మార్ట్‌ టెక్స్‌టైల్స్‌, హెల్త్‌కేర్‌, స్ట్రాటజిక్‌ అప్లికేషన్‌, ప్రొటెక్టివ్‌ గేర్స్‌కి సంబంధించిన 12 ప్రాజెక్టులు ఆమోదముద్ర పొందాయి. జియోటెక్స్‌టైల్స్‌, మొబిల్‌టెక్‌, స్పోర్ట్స్‌టెక్‌లకు సంబంధించినవి 5 ప్రాజెక్టులున్నాయి. మిగతావి సస్టెయినబుల్‌ టెక్స్‌టైల్స్‌కి సంబంధించినవని ప్రభుత్వం తెలిపింది.

read also: Andhra Pradesh,: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌.. భారీగా కొత్త పోస్టులు..!

రియల్‌ ఎస్టేట్‌పై ఫోకస్‌

ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌.. రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌పై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ఎల్డెకో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ప్రాపర్టీస్‌ లిమిటెడ్‌తో టైఅప్‌ అయింది. ఈ సంస్థలు వివిధ నగరాల్లో హౌజింగ్‌ ప్రాజెక్టుల డెవలప్‌మెంట్‌ కోసం 350 కోట్ల రూపాయల ఫండ్‌ను ఏర్పాటుచేయనున్నాయి. ఎల్డెకో గ్రూపు ఢిల్లీ నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌తోపాటు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో అభివృద్ధి చేయాల్సిన నాలుగు రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులను గుర్తించింది.

Exit mobile version