NTV Telugu Site icon

Lic Plan : ఈ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ. 12 వేలు పొందోచ్చు.. ఎలాగంటే?

Licc

Licc

ఈరోజుల్లో జనాలు సేవింగ్స్ చెయ్యడంలో ముందుంటున్నారు.. వారు సంపాదించే దాంట్లో కొంత అమౌంట్ అనేది దాస్తున్నారు.. సేవింగ్ స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.. అందులో కొందరు ఎల్ఐసీ వంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.. భారత ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఇప్పటివరకు ఎన్నో పథకాలను అందించింది.. ప్రతి పథకం మంచి ఆధాయాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు మనం పెన్షన్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఆదాయాన్ని పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఎల్‌ఐసీ సరల్ పెన్షన్ ప్లాన్.. ఈ ప్లాన్ పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా పెన్షన్‌కు హామీ ఇస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే మీరు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి. మీ జీవితాంతం పెన్షన్ పొందుతూనే ఉంటారు.. రిటైర్డ్ అయ్యాక ఈ పథకంలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు.. ఈ పెన్షన్ ప్లాన్ లో చెరెందుకు కనిష్టం 40, గరిష్టం 80 ఏళ్లు ఉన్నవారు అర్హులు. ఈ పాలసీ కింద నెలకు రూ. 1000 చొప్పున కూడా తీసుకోవచ్చు. త్రైమాసిక ప్రాతిపదికన కనీసం రూ. 3000, అర్ధ వార్షిక ప్రాతిపదికన రూ. 6000, వార్షిక ప్రాతిపదికన రూ. 12000 తీసుకోవాలి.. మంచి ఆదాయాన్ని అందిస్తున్న పథకాలలో ఇది కూడా ఒకటి..

ప్రతి నెలా 12 వేలను ఎలా పొందాలంటే.. ఈ పథకంలో పెద్ద మొత్తం అంటూ ఏమి లేదు.. మీకు నచ్చినట్లు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.. ప్రీమియం చెల్లించిన తర్వాత వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక, అది లేదంటే ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు. అతను ఈ ఏకమొత్త పెట్టుబడి నుంచే యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు.. ఉదాహరణకు 40 ఏళ్లు పైబడిన వ్యక్తి ఒక ముప్పై లక్షల పథకాన్ని కొనుగోలు చెయ్యొచ్చు.. ఆ వ్యక్తి ప్రతి నెలా 12,388 రూపాయల పెన్షన్ పొందుతారు. కుటుంబంలో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే ఆరు నెలల లోపు ఆ పథకాన్ని వెనక్కి ఇచ్చేయ్యొచ్చు.. అంతేకాదు దీనిపై రుణాన్ని కూడా పొందవచ్చు..

Show comments