లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం కొత్త కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. ఈ మేరకు మరో కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఆ పాలసీనే జీవన్ కిరణ్ లైఫ్ ఇన్సూరెన్స్..ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత పొదుపు, జీవిత బీమా పథకం. ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటంటే.. బీమా చేయబడిన వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే అటువంటి పరిస్థితిలో అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే చెల్లించిన మొత్తం ప్రీమియం తిరిగి ఇవ్వబడుతుంది..
ఈ పాలసీ గురించి తాజాగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.. విచిత్రమెంటంటే ఈ పథకంలో ధూమపానం చేసేవారికి, ధూమపానం చేయనివారికి వేర్వేరు ప్రీమియం రేట్లు నిర్ణయించబడ్డాయి. ఈ పాలసీ కింద కనీస ప్రాథమిక హామీ మొత్తం రూ.15,00,000, గరిష్ట ప్రాథమిక హామీ మొత్తం కోసం గడువు నిర్ణయించలేదు. అలాగే ఈ పథకం గృహిణులు, గర్భిణీ స్త్రీలకు వర్తించదని గుర్తించుకోవాలి.. ఈ పాలసీకి తక్కువ మెచ్యూరిటీ కాలంను కలిగి ఉంది.. కేవలం 10 ఏళ్లు మాత్రమే..ఈ పాలసీ తీసుకున్న వారునెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షికంగా కూడా ప్రీమియం చెల్లించుకునే సదుపాయం ఉంది. మీరు ఇంకా కోవిడ్-19 కోసం టీకాలు వేసుకోకపోతే ఈ పథకాన్ని తీసుకోలేరు..
పాలసీ అమలులో ఉన్నట్లయితే, మెచ్యూరిటీపై హామీ ఇవ్వబడిన మొత్తం సాధారణ ప్రీమియం లేదా సింగిల్ ప్రీమియం చెల్లింపు కింద ఎల్‌ఐసీ ద్వారా పొందే మొత్తం ప్రీమియంలకు సమానంగా ఉంటుంది. అయితే, పాలసీ మెచ్యూరిటీ తేదీ తర్వాత జీవిత బీమా కవరేజ్ వెంటనే రద్దు చేయబడుతుంది. జీవన్ కిరణ్ లైఫ్ ఇన్సూరెన్స్ హోల్డర్ మరణిస్తే అతని కుటుంబానికి రెగ్యులర్ ప్రీమియం చెల్లింపు పాలసీ కింద వార్షిక ప్రీమియం 7 రెట్లు లభిస్తుంది.. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే..సింగిల్ ప్రీమియంపై 125 శాతం బెనిఫిట్ పొందవచ్చు. ఇది కాకుండా ప్రాథమిక హామీ మొత్తం కూడా చెల్లించబడుతుంది.. లోన్ ఫెసిలిటి కూడా ఉండనుందని అధికారులు చెబుతున్నారు..