NTV Telugu Site icon

LIC Pension Plan: ఎల్ఐసీలో అదిరిపోయే ప్లాన్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతినెల రూ.14 వేలు పెన్షన్..

Lic (2)

Lic (2)

ప్రభుత్వ ఇన్సూరెన్స్ భీమా సంస్థ ఎల్ఐసీ తన కస్టమర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.. మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది.. ఎల్ఐసీ న్యూ పెన్షన్ ప్లస్ పేరుతో మరో ప్లాన్ తీసుకొచ్చింది. ఇది నాన్ పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్డ్, ఇండివిజ్యువల్ పెన్షన్ ప్లాన్. రెగ్యులర్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం ఆప్షన్స్‌తో ఈ పాలసీ లభిస్తుంది. పాలసీ ముగిసిన తర్వాత యాన్యుటీ ప్లాన్ ఎంచుకోవచ్చు. యాన్యుటీ ప్లాన్ ఎంచుకున్నవారికి ప్రతీ నెలా పెన్షన్ రూపంలో ఆదాయం లభిస్తుంది. వద్ధాప్యంలో పెన్షన్ పొందడానికి ఇప్పటి నుంచే పొదుపు చేయాలనుకునేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు..

ఇక ఈ ప్లాన్ లో చేరడానికి 25 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వయస్సు ఉండాలి. పాలసీ టర్మ్ 10 ఏళ్ల నుంచి 52 ఏళ్ల వరకు ఉంటుంది. సింగిల్ ప్రీమియం ఆప్షన్‌లో కనీసం రూ.1,00,000 ఇన్వెస్ట్ చేయాలి. రెగ్యులర్ ప్రీమియం ఆప్షన్‌లో నెలకు రూ.3,000, మూడు నెలలకు రూ.9,000, ఆరు నెలలకు రూ.16,000, ఏడాదికి రూ.30,000 చొప్పున చెల్లించాలి.. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు.. మీ పెట్టుబడిని బట్టి మీకు పెన్షన్ వస్తుంది.. ఇకపోతే ఏడాదిలో నాలుగు సార్లు ఫండ్స్ మార్చుకోవచ్చు. ఈ పాలసీలో ఐదేళ్లు లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఐదేళ్ల తర్వాత యూనిట్స్‌ను కొంత విత్‌డ్రా చేసుకోవచ్చు..

రెండు టర్మ్ పాలసీలను తీసుకొచ్చింది.. రెగ్యులర్ ప్రీమియం పాలసీలో 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 42 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే 42 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. అంటే మీరు ప్రతి ఏడాది రూ.30,000 ప్రీమియం చెల్లించారని అనుకుందాం. మెచ్యూరిటీ నాటికి 4 శాతం వార్షిక రిటర్న్స్ ప్రకారం రూ.21,83,069 రిటర్న్స్, రూ.2,55,397 యాన్యుటీ లభిస్తుంది. అంటే నెలకు సుమారు రూ.21,000 పెన్షన్ లభిస్తుంది. ఇక 8 శాతం వార్షిక రిటర్న్స్ ప్రకారం రూ.59,92,991 రిటర్న్స్, రూ.7,06,928 యాన్యుటీ లభిస్తుంది.. అంటే మీకు ప్రతి నెలా రూ.58,000 పెన్షన్ లభిస్తుంది..

ఇకపోతే సింగిల్ ప్రీమియం పాలసీలో 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 42 ఏళ్ల పాలసీ టర్మ్ ఎంచుకున్నారని అనుకుందాం. సింగిల్ ప్రీమియం రూ.1,00,000 చెల్లించాలి. మెచ్యూరిటీ నాటికి 4 శాతం వార్షిక రిటర్న్స్ ప్రకారం రూ.3,69,948 రిటర్న్స్, రూ.42,808 యాన్యుటీ లభిస్తుంది. అంటే నెలకు సుమారు రూ.3,500 పెన్షన్ లభిస్తుంది. ఇక 8 శాతం వార్షిక రిటర్న్స్ ప్రకారం రూ.14,55,283 రిటర్న్స్, రూ.1,70,253 యాన్యుటీ లభిస్తుంది.. అంటే మీకు ప్రతి నెల రూ.14 వేల పెన్షన్ పొందవచ్చు.. ఒకవేళ ఈ ప్లాన్ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే.. పాలసీ వ్యాల్యూ ను బట్టి మనీని నామీనికి ఇస్తారు..