NTV Telugu Site icon

LIC New Plan : ఎల్ఐసీ సూపర్ ప్లాన్..ప్రతి ఏటా రూ.1,42,508 పెన్షన్.. ఎలాగంటే?

Lic

Lic

మన దేశంలోని అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ లను అందిస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తుంది.. ఇప్పటికే అందుబాటులో ఉన్న పథకాలు జనాలను ఆకర్షస్తున్నాయి.. ఇటీవల కొత్తగా కొన్ని పథకాలు వచ్చి చేరాయి.. వాటిలో జీవన్ శాంతి పాలసీ కూడా ఒకటి.. ఈ పాలసీ బెనిఫిట్స్ బాగుండటంతో ఎక్కువ మంది ఈ పాలసిని తీసుకుంటున్నారు.. ఒకసారి ఈ పాలసీ పూర్తి వివరాలను తెలుసుకుందాం..

ఈ ప్లాన్లో రెండు రకాల ప్లాన్స్ ను అందిస్తుంది.. అందులో డిలైడ్ యాన్యుటీలను అందిస్తుంది. వీటిలో సింగిల్ లైఫ్‌కు వాయిదా వేసిన యాన్యుటీ, జాయింట్‌ లైఫ్‌కు వాయిదా వేసిన యాన్యుటీ ఉంటాయి.. యాన్యుటీ పేమెంట్స్‌ జీవితాంతం కొనసాగుతాయి.. వీటిలో ఒకటి ఎంపిక చేసుకుంటే మళ్లీ మార్చడం కుదరదు.. ఇక ఈ ప్లాన్ ను తీసుకొనేవాళ్ళకు 30 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.. ఈ ప్లాన్ కొనుగోలు చేసే వాళ్లు కనీసం రూ.1.5 లక్షలకు కొనుగోలు చేసుకోవాలి..యాన్యుటీ పేమెంట్స్ ఫ్రీక్వెన్సీని ఎంచుకోవడానికి పాలసీదారులకు వీలు కల్పిస్తుంది. నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక లేదా వార్షిక పేమెంట్స్‌లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.. అలాగే అవసరమైనప్పుడు ఆ డబ్బులను తీసుకోవచ్చు..

ఈ పాలసీ తీసుకున్నప్పుడు ఎంత పెన్షన్ వస్తుందంటే.. పాలసీదారుడు కొనుగోలు చేసే అమౌంట్ మీద పెన్షన్ ఆధారపడి ఉంటుంది.. మీరు 30 ఏళ్ల వయస్సులో రూ.10 లక్షలతో ప్లాన్‌ని కొనుగోలు చేసి, యాన్యుటీ చెల్లింపులను 5 సంవత్సరాలు వాయిదా వేసినట్లయితే.. మీకు రూ. 86,786 ఏటా పెన్షన్ వస్తుంది.. అదే విధంగా మీకు 30 ఏళ్ల వయస్సులో ప్లాన్‌ను కొనుగోలు చేసి, 12 ఏళ్ల పాటు యాన్యుటీ చెల్లింపులను వాయిదా వేస్తే, వార్షిక పెన్షన్ రూ.1,32,920 అందుతుంది..45 ఏళ్ల వయస్సులో రూ.10 లక్షలతో ప్లాన్‌ని కొనుగోలు చేసి 5 ఏళ్ల వరకు తీసుకుంటే రూ.90,450 పొందవచ్చు. అదే విధంగా , 12 ఏళ్ల పాటు యాన్యుటీ పేమెంట్స్ వాయిదా వేస్తేరూ. రూ.1,42,508 పెన్షన్ పొందవచ్చు..