NTV Telugu Site icon

LIC launches its WhatsApp Services: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఎల్‌ఐసీ.. ఇక, అన్ని సేవలు వాట్సాప్‌లోనే..!

Lic

Lic

జీవిత బీమా సం స్థ (ఎల్ఐసీ) తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది.. తమ పాలసీకి సంబంధించిన వివరాలు కావాలంటే.. ఇప్పటి వరకు ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండేది.. కానీ, ఇకపై అన్ని వాట్సాప్‌లోనే తెలుసుకునే వెసులుబాటు తీసుకొంది.. పాత, కొత్త పాలసీ వివరాలు, ప్రీమియం, బోనస్ ఇతర సర్వీసులపై పూర్తి సమాచారం అందించే విధంగా.. వాట్సా ప్ సర్వీస్‌ను ప్రారంభించింది ఎల్ఐసీ.. అంటే, ఇకపై ప్రతీ చిన్న పనికి కార్యాలయానికి పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట.. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడించారు.. ఇంతకీ వాట్సాప్‌ సేవలను తీసుకొచ్చిన ఎల్‌ఐసీ.. ఏ నంబర్‌ కేటాయించింది.. ఎలాంటి సేవలు పొందవచ్చు.. ఎలా పొందాలి అనే వివరాల్లోకి వెళ్తే.. ఎల్ఐసీ పోర్టల్‌లో తమ పాలసీలను నమోదు చేసుకున్న పాలసీదారులు మొబైల్ నంబర్ 8976862090కి ‘HI’ అని చెప్పడం ద్వారా వాట్సాప్‌లో ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు..

– పాలసీ ప్రీమియం బకాయి
– పాలసీ బోనస్ సమాచారం
– తన పాలసీ స్థితి
– లోన్ అర్హత కొటేషన్
– లోన్ రీపేమెంట్ కొటేషన్
– తన లోన్‌పై చెల్లించవలసిన వడ్డీ
– ప్రీమియం చెల్ పు సర్టిఫికేట్
– యూఎల్‌ఐపీ-యూనిట్ల స్టేట్మెంట్
– ఎల్ఐసీ సర్వీస్ లింక్‌లు..
– సేవలను ఎలా ప్రారంభించాలి, ఎలా నిలిపివేయాలో తెలుసుకోవడం..
– ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లొ ‘కస్టమర్ పోర్టల్’ ద్వారా ఏం తెలుసుకోవాలి సహా పలు రకాల సేవలను పొందవచ్చు..