Site icon NTV Telugu

LIC Best Schemes 2023: 2023 లో వచ్చిన ఎల్ఐసీ బెస్ట్ స్కిమ్స్.. బెనిఫిట్స్…?

Lic (2)

Lic (2)

మన భారతీయ దిగ్గజ ఇన్సూరెన్స్ కంపెనీ తమ కస్టమర్ల కోసం కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది… ఎన్నో స్కీమ్ లతో ప్రయోజనాలు ఉన్నాయి.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో ఎక్కువ స్కీమ్ లను ప్రజలకు అందించింది.. ఈ ఏడాదిలో దాదాపు ఐదు పథకాలు ఈ లక్ష్యంతోనే ప్రారంభించింది. వీటిల్లో అధిక రాబడితో పాటు పన్ను ప్రయోజనాలు కూడా ఉంటున్నాయి. ఆ ఎల్ఐసీ నాలుగు పథకాల వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎల్ఐసీ జీవన్ శాంతి అనేది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, సింగిల్ ప్రీమియం డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఇది పాలసీ మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత సాధారణ చెల్లింపులను పొందేందుకు కాలక్రమేణా నిధులను సేకరించవచ్చు. ఇది పాలసీదారులకు పదవీ విరమణ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.. ఈ స్కీమ్ వల్ల మంచి బెనిఫిట్స్ ఉండటంతో ఎక్కువ మంది ఈ స్కింలో జాయిన్ అవుతున్నారు.. మంచి బెనిఫిట్స్ ఉన్నాయి..

జీవన్ ఆజాద్ పాలసీ.. జనవరిలో దీన్ని ప్రారంభించారు.. రక్షణలు, పెట్టుబడులను సులభతరం చేయడానికి రూపొందించబడింది. జీవన్ ఆజాద్ పన్ను ఆదా, మెరుగైన రాబడి, మెచ్యూరిటీ ప్రయోజనాలు, మరణ ప్రయోజనాలు వంటి అనేక ఫీచర్లో వస్తుంది. పాలసీదారులు గరిష్టంగా 50 సంవత్సరాల వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు.. పన్ను మినహాయింపు తో పాటు ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి..

ఎల్ఐసీ జీవన్ కిరణ్ పాలసీ.. ఈ పాలసీ కూడా ఈ ఏడాదిలోనే మొదలైంది.. 2023 జూలై లో జీవన్ కిరణ్ పథకాన్ని ఎల్ఐసీ ప్రారంభించింది.. సింగిల్ ప్రీమియం చెల్లింపులు అలాగే సాధారణ ప్రీమియం పాలసీ చెల్లింపులు వాయిదాతో అనుమతించబడతాయి… ఈ పథకం ద్వారా మనం రుణ సౌకర్యం, గ్యారెంటీ సరెండర్ విలువ, డెత్ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, సెటిల్‌మెంట్ బెనిఫిట్స్ లభిస్తాయి.. మీరు ఎంత పెట్టుబడి పెడితే.. మీకు అంతగా బెనిఫిట్స్ ఉన్నాయి..

ఎల్ఐసీ ధన్ వృద్ధి పథకం.. ఇది నాన్ లింక్డ్ పాలసీ ఎండోమెంట్ ప్లాన్‌లతో పాలసీదారులకు పొదుపు క్రమశిక్షణను కలిగిస్తుంది. మెచ్యూరిటీ బెనిఫిట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్, సింగిల్ ప్రీమియం, ట్యాక్స్ బెనిఫిట్స్ వంటి బహుళ ప్రయోజనాలతో పాటు పాలసీ హోల్డర్‌లు స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే టర్మ్‌ని నిర్ణయించుకోవడానికి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.. మెచ్యూరిటీ సమయానికి మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.. ఇంకా పన్ను మినహాయింపు తో పాటుగా లోన్ సౌకర్యం కూడా ఉంటుంది..

Exit mobile version