కియా ఇండియా సంస్థ భారత్ నుంచి ఇప్పటికే సుమారు లక్ష కియా కార్లను విదేశాలకు ఎగుమతి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కియా కంపెనీ నుంచి కారెన్స్ అనే కొత్త కారును లాంచ్ చేసేందుకు సిద్దమయింది. ఈనెల 15 నుంచి కియా కంపెనీ బుకింగ్స్‌ను ప్రారంభిస్తోంది కియా. రూ. 25 వేలు చెల్లించి కంపెనీ వెబ్ సైట్ లేదా డీలర్ ద్వారా కొత్త మోడల్ బుక్ చేసుకొవచ్చని కియా పేర్కొన్నది. ఆరు లేదా ఏడు సీట్లతో ఐదు మోడల్స్ లో ఈ కారు అందుబాటులోకి రానున్నది. బాస్ స్పీకర్ సిస్టమ్, ఆరు ఎయిర్ బ్యాగులు, ఎయిర్ ప్యూరిఫైర్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, ఆల్ వీల్ డిస్క్ బ్రేకులు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఐదు మోడళ్లలో లభించే కియా కారెన్స్ రూ. 12 నుంచి రూ. 18 లక్షల వరకూ అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
Read: మత్స్యకారుడిని లక్షాధికారిని చేసిన ఆ చేప…