Site icon NTV Telugu

జియో నుంచి అత్యంత చౌకైన 5 జీ మొబైల్‌…

దేశీయంగా సంచ‌నాలు సృష్టిస్తున్న జియో మ‌రో సంచ‌ల‌నంతో ముందుకు రాబోతున్న‌ది. భార‌త్‌లో అత్యంత త‌క్కువ ధ‌ర‌కు జియో 4జీ స్మార్ట్ ఫోన్‌ను ఇప్ప‌టికే అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో, గూగుల్ భాగ‌స్వామ్యంతో ఈ మొబైల్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, ఇప్పుడు చ‌వ‌కైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ద‌మ‌వుతుంది. భార‌త్‌లో 5జీ విస్త‌ర‌ణ‌లో జియో ముందంజ‌లో ఉన్న‌ది. దీనికి త‌గ్గ‌ట్టుగా 5 జీ స్మార్ట్‌ఫోన్ ను రిలీజ్ చేసేందుకు జియో సన్నాహాలు చేస్తున్న‌ది. రియ‌ల్‌మీ, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ల‌కు పోటీగా రిల‌య‌న్స్ జియో 5 జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్న‌ది. ప్ర‌స్తుతం 5 జీ స్మార్ట్‌ఫోన్ ధ‌ర భార‌త్‌లో రూ. 15 వేల వ‌ర‌కు ఉన్న‌ది.

Read: కొరియా వ్యాధి గురించి ఎప్పుడైనా విన్నారా?

అయితే, జియో తీసుకురాబోయే 5జీ స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ. 10 వేల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. క్వాల‌కం స్నాప్ డ్రాగ‌న్ 480 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 13 ఎంపీ ప్ల‌స్ ఎంపీ రియ‌ర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, మైక్రో ఎస్‌డీ కార్ట్ స్లాట్‌, ఎన్3, ఎన్‌5, ఎన్‌28, ఎన్‌40, ఎన్‌78 బ్యాండ్ స‌పోర్ట్‌, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ స‌పోర్ట్ ఫీచ‌ర్ల‌తో 5జీ మొబైల్ అందుబాటులోకి రాబోతున్న‌ట్టు స‌మాచారం.

Exit mobile version